గురువారం 02 జూలై 2020
Suryapet - Jun 05, 2020 , 19:28:44

సూర్యాపేట జిల్లాలో ట్రాక్టర్లతో ఏరువాక

సూర్యాపేట జిల్లాలో ట్రాక్టర్లతో ఏరువాక

గరిడేపల్లి : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గం గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో శుక్రవారం రైతులు ట్రాక్టర్లతో ఏరువాక సాగారు.

ఈ సందర్భంగా ఎద్దులు, వ్యవసాయ సామగ్రిని అలంకరించి మేళతాళాలతో ఘనంగా ఊరేగించారు. అనంతరం ఆలయాల్లో పూజలు చేసి పొలాల్లో నారుమడి దున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు.


logo