బొడ్రాయిబజార్: రాష్ట్రంలో అతి భారీ వర్షాలున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో ని లోతట్టు ప్రాంతాల్లో, వార్డుల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు, ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకు గాను మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ పి. రామాంజులరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హెల్ప్ డెస్క్ నెంబర్ 9849907765 నంబర్, మున్సిపల్ అధికారులకు వెంటనే సమాచారం అందించాలన్నారు. సహా యక చర్యల్లో భాగంగా పట్టణంలోని నైట్ షెల్టర్‌లో వసతి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆయా వార్డుల్లో ప్రజలకు వార్డు అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. అలాగే భారీ వర్షాల దృష్ట్యా సూర్యాపేట మున్సిపాల్టీలో ఎమర్జెన్సీ టీంను ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా వెంటనే హెల్ప్ డెస్క్‌ను, వార్డు అధికారిని సంప్రదించాలన్నారు.