e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home సూర్యాపేట అన్నదాతల అభివృద్ధే సర్కారు లక్ష్యం

అన్నదాతల అభివృద్ధే సర్కారు లక్ష్యం

అన్నదాతల అభివృద్ధే సర్కారు లక్ష్యం

సూర్యాపేట రూరల్‌, జూన్‌ 23 : రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం అన్నారు. జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన కంది, పెసర, చిరు ధాన్యాల విత్తన కిట్లను మండలంలోని కేసారం గ్రామంలో బుధవారం రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెట్ట భూముల్లో పప్పు ధాన్యాలను పండించడానికి ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలను అందిస్తున్నదన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ రైతుబంధు, రైతు బీమా పథకాలతోపాటు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ రామసాని శ్రీనివాస్‌నాయుడు, ఏఓ జానీమియా, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ కక్కిరేణి నాగయ్యగౌడ్‌, సర్పంచులు మెంతబోయిన నాగయ్య, పాముల ఉపేందర్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ సంకరమద్ది రమణారెడ్డి, ఏఈఓ ముత్తయ్య, నాయకులు

రైతులకు కంది, పెసర విత్తనాలు అందజేత
తిరుమలగిరి మండలంలోని మామిడాల గ్రామంలో రైతులకు సబ్సిడీపై కంది, పెసర విత్తనాలను ఏఈఓ శ్రీనివాస్‌ బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందులు నాలుగు కిలోలు, పెసర్లు రెండు కిలోల ప్యాకెట్లను సబ్సిడీపై రెండు వందల రూపాయలకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ బెడద కర్ణాకర్‌, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అన్నదాతల అభివృద్ధే సర్కారు లక్ష్యం
అన్నదాతల అభివృద్ధే సర్కారు లక్ష్యం
అన్నదాతల అభివృద్ధే సర్కారు లక్ష్యం

ట్రెండింగ్‌

Advertisement