e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home సూర్యాపేట జయశంకర్‌ సార్‌ సేవలు మరువలేనివి

జయశంకర్‌ సార్‌ సేవలు మరువలేనివి

జయశంకర్‌ సార్‌ సేవలు మరువలేనివి

హుజూర్‌నగర్‌, జూన్‌ 21: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రొఫెసర్‌ జయశంకర్‌ సేవలు మరువలేనివని హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని మాధవరాయినిగూడెంలో జయ శంకర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆచార్య జయశంకర్‌ ఆనాడు ఉద్యమ నాయకుడిగా ఉన్న సీఎం కేసీఆర్‌తో కలిసి ఎన్నో పోరాటాలు చేశారన్నారు. అనంతరం రూ. కోటితో నిర్మిస్తున్న వైకుంఠధామం పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గెల్లి అర్చనారవి, వైస్‌ చైర్మన్‌ జక్కుల నాగేశ్వర్‌రావు, కమిషనర్‌ నరేశ్‌రెడ్డి, మాజీ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, అట్లూరి హరిబాబు, చిట్యాల అమర్‌నాథ్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ప్రొఫెసర్‌ ఆశయాల సాధనలో భాగస్వాములు కావాలి
బొడ్రాయిబజార్‌ : జయశంకర్‌ సార్‌ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో జయశంకర్‌ చిత్రపటానికి ఆమె పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ పి.రామానుజులరెడ్డి, కౌన్సిలర్లు షేక్‌ బాషా, తాహేర్‌పాషా, చింతలపాటి భరత్‌ మహజన్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు వెంపటి సురేశ్‌, డీఈ సత్యారావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సారగండ్ల శ్రీనివాస్‌, గౌస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు సిరివెళ్ల శబరి, పిడమర్తి శంకర్‌, 9వ వార్డు అభివృద్ధ్ది కమిటీ అధ్యక్షుడు దేశగాని ఉదయ్‌ పాల్గొన్నారు.

- Advertisement -

నాన్‌ గెజిటెడ్‌ సంఘం ఆధ్వర్యంలో ..
సూర్యాపేట అర్బన్‌ : టీఎన్‌జీఓఎస్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో జయశంకర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జానిమియా, దున్న శ్యామ్‌ మా ట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అం కితం చేసిన మహనీయుడు అని అన్నారు. నివాళులర్పించిన వారిలో నర్సింహాచారి, ప్రేమ్‌కరణ్‌రెడ్డి, శ్రీదేవి, వెంకటేశ్వర్లు, సురేశ్‌, మాధవరెడ్డి, శేఖర్‌, కిషన్‌, శ్రీనాథ్‌, మహేందర్‌ పాల్గొన్నారు.

తుంగతుర్తి : మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌, ఎంపీడీఓ కార్యాలయాల్లో జయశంకర్‌సార్‌ చిత్రపటానికి డీసీసీబీ డైరెక్టర్‌ గుడిపాటి సైదులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్‌, వైస్‌ ఎంపీపీ శ్రీశైలంయాదవ్‌, సర్పంచ్‌ నల్లు రాంచంద్రారెడ్డి, ఎంపీడీఓ లక్ష్మి, ఆలయ చైర్మన్‌ ముత్యాల వెంకన్న, గోపగాని రమేశ్‌గౌడ్‌, మల్లెపాక వెంకన్న, యల్లబోయిన భిక్షం, ఏపీఓ వెంకన్న పాల్గొన్నారు.

చివ్వెంల : మండలంలోని బండమీది చందుపట్లలో జయశంకర్‌ సార్‌ చిత్ర పటానికి పీఏసీఎస్‌ చైర్మన్‌ మారినేని సుధీర్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బోయిళ్ల కృష్ణ, ఉపసర్పంచ్‌ కృష్ణ, కలగాని వెంకన్న, ఇటుకుల సైదులు, సైదిరెడ్డి, శ్రీ ను, నరేశ్‌,సురేందర్‌, నర్సయ్య పాల్గొన్నారు.

అర్వపల్లి : మండలంలో పలు గ్రామాల్లో జయశంకర్‌ సార్‌ చిత్రపటానికి ఎంపీపీ మన్నె రేణుకాలక్ష్మీనర్సయ్యయాదవ్‌, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌ యాదవ్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో సర్పంచులు పుప్పాల శేఖర్‌, బైరబోయిన సునీతా రామలింగయ్య, దానం సుజాతాయాదగిరి, రమావత్‌ పీరమ్మ శీనయ్యనాయక్‌, ఉపసర్పంచ్‌ పులిచర్ల ప్రభాకర్‌ పాల్గొన్నారు.

నాగారం :ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కూరం మణి జయశంకర్‌సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గాలి శోభారాణి, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.

నేరేడుచర్ల : బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో జయశంకర్‌ సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ధూళిపాల ధనుంజయనాయుడు. బొడ్డుపల్లి సుందరయ్య, కొమర్రాజు వెంకట్‌, రావుల సత్యం, మహేశ్‌, సీతారాములు, వెంకటేశ్వర్లు, శ్రీపాద్‌ పాల్గొన్నారు.

చిలుకూరు : స్థానిక బాపూజీ గ్రంథాలయంలో ఎస్టీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దొడ్డా నారాయణరావు, మాజీ జడ్పీటీసీ గన్నా చంద్రశేఖర్‌, ఎంపీటీసీ వడ్డేపల్లి కళ్యాణీకోటేశ్‌, డీఆర్‌డీఏ డైరెక్టర్‌ కస్తూరి నర్సయ్య, గ్రంథాలయ చైర్మన్‌ అంబాల వెంకటి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జయశంకర్‌ సార్‌ సేవలు మరువలేనివి
జయశంకర్‌ సార్‌ సేవలు మరువలేనివి
జయశంకర్‌ సార్‌ సేవలు మరువలేనివి

ట్రెండింగ్‌

Advertisement