కరోనా విజృంభిస్తుండడంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. కొవిడ్ నియంత్రణకు ప్రభుత్వ, ప్రైవేట్
కార్యాలయాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నది. ప్రధానంగా ఆఫీసుకు వెళ్లకుండానే పనులు చేసుకునే విధంగా ఆన్లైన్ సేవలు వినియోగించుకోవాలని చెబుతున్నది. ఇందుకోసం పలు యాప్‌లను ప్రభుత్వం రూపొందించింది.సూర్యాపేటలో మున్సిపల్ అధికారులు వీటిపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. కరోనా వేళ ఇంటి నుంచి ఆన్లైన్ సేవలు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.
పన్ను చెల్లింపులకు వీలుగా వాట్సాప్ నంబర్
మున్సిపాలిటీలకు సంబంధించిన గృహ యజమానులు తమ ఇంటి పన్ను వివరాలు తెలుసుకునేందుకు వాట్సాప్ నంబర్ 9000253342కి హాయ్ అని మెస్సేజ్ చేస్తే మీ ఇంటి పన్ను బకాయి వివరాలు వస్తాయి. పక్కనే ఉన్న బార్ కోడ్ ద్వారా ఇంటి పన్ను చెల్లించుకునే వీలుంది.
దెలాగంటే..మొబైల్ వాట్సాప్‌కు 9000253342 నంబర్‌ను అనుసంధానం చేసుకోవాలి.
తర్వాత హాయ్ అనే సందేశాన్ని పంపాలి. నూతన విధానం వివరాలతో కూడిన తిరుగు సందేశం వస్తుంది. తర్వాత దశ కోసం భాషను ఎంచుకోవాలి. ఇందుకోసం తెలుగు అయితే ఏ లేదా తెలుగు అని, ఆంగ్లం అయితే బీ లేదా ఇంగ్లిష్ అని అక్షరాలను టైప్ చేసి మెస్సేజ్ చేయాలి
భాష ఎంచుకున్నట్లు మరో సందేశం అందుతుంది. దాంతోపాటు పన్ను వివరాలను తెలుసుకునేందుకు రెండు ఆప్షన్లు ఇస్తారు. అవి 1 అస్తి పన్ను సంఖ్య(పీటీఐఎస్), 2. ఇంటి నంబరు వీటిల్లో ఏదో ఒకదాన్ని ఎంటర్ చేసి సందేశం పంపితే రాష్ట్రంలోని 140 పుర, నగర పాలక సంస్థల వివరాలు ప్రత్యక్షమవుతాయి.
1-140 అంకెల్లో మీ పట్టణం ఏ సంఖ్యలో ఉందో దాన్ని ఎంటర్ చేసి పంపాలి.
పై ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే మీ పట్టణం, నగరం పేరుతో మరో సందేశం వస్తుంది. తర్వాత ఇంటి సంఖ్యను నమోదు చేస్తే దానిపై ఉన్న పన్ను వివరాలన్నీ వస్తాయి.
ఒక వేళ మీరు బకాయి ఉంటే పేమెంట్ ఆప్షన్ కూడా వస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డు, వ్యాలెట్ ద్వారా పన్ను చెల్లించవచ్చు.
వాట్సాప్ చాట్‌లో ఏ సాంకేతిక సమస్యలున్నా, వివరాలపై సందేహాలున్నా 914023120410 నంబర్‌కు ఫోన్ చేయొచ్చు. httpsg:cdma.cgg.gov.in వెబ్సైట్లో వివరాలు పొందవచ్చు.
ఇందుకోసం సిటిజన్ బడ్డీయాప్తో వాట్సాప్ సేవలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే ఫిర్యాదుల స్వీకరణకు మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ 08684-220049ను కూడా ఏర్పాటు చేశారు.
సిటిజన్ బడ్డీ యాప్
ఆస్తి పన్ను చెల్లింపు, ఇంటి నంబరు పొందేందుకు, భవన నిర్మాణానికి అనుమతి, జనన, మరణ ధ్రువీకరణ పత్రం పొందడానికి, నల్లా కనెక్షన్ తీసుకోవడానికి, వ్యాపార అనుమతి తదితర సేవలు పొందేందుకు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగాల్సిన అవసరం లేకుండా సిటిజన్ బడ్డీ యాప్ అందుబాటులో ఉంది. అన్ని సేవలు ఇందులో పొందవచ్చు.
యాప్ డౌన్లోడ్ ఇలా..
స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి సిటిజన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ కాగానే జిల్లా పేరు మనం కోరుకున్న మున్సిపాలిటీ పేరు ఎంపిక చేసుకొని వ్యక్తి గత ఫోన్ నంబరు లేదా ఈ-మెయిల్ ఐడీ నమోదు చేయాలి. సబ్మిట్ బటన్ నొక్కితే యాప్‌లో పొందుపర్చిన పౌర సేవలు, పురపాలిక సంబంధిత వివరాలతో ముఖచిత్రం వస్తుంది. పన్నుల చెల్లింపు మొదలు కోరుకున్న సేవలను నేరుగా పొందే వీలు కలుగుతుంది.