e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home సూర్యాపేట వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం

వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం

వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం

నిడమనూరు, మార్చి16 : మండల కేంద్రంలో ఉన్న గోవిందమాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వేదపండితులు  ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గోవిందమాంబ, వీరబ్రహ్మేంద్ర స్వామి కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. కుందూరు రఘువీర్‌రెడ్డి, మేరెడ్డి వెంకట్రాహుల్‌ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ విశ్వనాథుల బ్రహ్మచారి, కమిటీ సభ్యులు తుడిమిల్ల రాములు, గొట్టిముక్కుల నరసింహాచారి, కాసోజు కృష్ణమాచారి, ముకురోజు జ్ఞానేశ్వర్‌, అందోజు రామాచారి, ఎంపీటీసీ విశ్వనాథుల రాణీరమేశ్‌, బొల్లం బాలయ్య, మెరుగు మధు, కుందూరు లక్ష్మారెడ్డి, పిల్లి రాజు యాదవ్‌, గాయకవాడ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

వేంకటేశ్వరస్వామి కల్యాణం

కొండమల్లేపల్లి : మండలంలోని మంత్రితండాలో వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన రమావత్‌ కవితాలచ్చిరాం స్వామివారికి మంగళసూత్రం, మెట్టెలు అందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ రమావత్‌ రవినాయక్‌, బి.లచ్చీరాం పాల్గొన్నారు.  

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం

ట్రెండింగ్‌

Advertisement