e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home సూర్యాపేట లాక్‌డౌన్‌కు సంపూర్ణ మద్దతు

లాక్‌డౌన్‌కు సంపూర్ణ మద్దతు

లాక్‌డౌన్‌కు సంపూర్ణ మద్దతు

సూర్యాపేట/ నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌, మే 12 : కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అమలవుతుంది. ఉదయం 10 గంటల వరకు అనుమతి ఇవ్వడంతో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌ పట్టణాలతోపాటు అన్ని మండలాల్లో ప్రజలు తమ అవసరాల కోసం, సరుకులు చేసేందుకు బయటకు వచ్చారు. ఉదయం ఆరు గంటలకే దుకాణాలు తెరువడంతో ప్రజలు రోడ్లుపైకి వచ్చారు. వాహనాలు, కొనుగోలుదారులతో పట్టణాలు, మండల కేంద్రాలు రద్దీగా మారాయి. కిరాణా షాపులు, కూరగాయల మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. గంటలకు లాక్‌డౌన్‌ ప్రారంభం కావడంతో రోడ్లు ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారాయి. స్వచ్ఛందంగా దుకాణాలు షాపులు, దవాఖానలు మాత్రమే తెరిచి ఉన్నాయి. పోలీసులు రోడ్లపైకి వచ్చి పర్యవేక్షించారు. బయటకు వారిని పంపించివేశారు. అటు మండలాలతోపాటు గ్రామాల్లో సైతం లాక్‌డౌన్‌ పక్కాగా అమలవుతుంది. గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి ఇండ్లకే పరిమితమయ్యారు. అటు ఆర్టీసీ బస్సులు ఉదయం ఆరు నుంచి 10 గంటల వరకే నడిచాయి. అనంతరం డిపోలకే పరిమితమయ్యాయి. మునగాలలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన 15మందికి జరిమానా విధించినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

సరిహద్దులో వాహనాలపై ఆంక్షలు
కోదాడ రూరల్‌ : లాక్‌డౌన్‌ ప్రకటనతో రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన నల్లబండగూడెం శివారులోని రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద పోలీస్‌, రెవెన్యూ, ఎంవీఐ, ఆరోగ్య, పంచాయతీ శాఖల ఆధ్వర్యంలో చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోకి అనుమతి లేని వాహనాలను వెనక్కి పంపించారు. సరిహద్దు చెక్‌పోస్ట్‌ను కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌ పర్యవేక్షించారు. వాహన తనిఖీల్లో రూరల్‌ సీఐ శివరాంరెడ్డి, ఎంవీఐ వీరేంద్రనాథ్‌, తాసీల్దార్‌ శ్రీనివాస్‌శర్మ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ నిరంజన్‌, రూరల్‌ ఎస్‌ఐ సైదులు, పోలీసులు పాల్గొన్నారు.

ఆలయాల మూసివేత
లాక్‌డౌన్‌ నేపథ్యంలో పలు దర్శనాలు నిలిపివేశారు. అన్నపూర్ణ సహిత విశ్వనాథస్వామి వేంకటేశ్వరస్వామి తదితర ఆలయాలకు అర్చకులు తాళం వేశారు. స్వామి వార్లకు నిత్య సేవలు, అభిషేకాలు, అర్చనలు, అంతరంగికంగా మాత్రమే నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయాన్ని ఉదయం నిత్య కైంకర్యాల అనంతరం మూసివేశారు. ఆలయంలో నెల 22వరకు దైవ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరి విజయ్‌కుమార్‌, ఈఓ నవీన్‌ తెలిపారు. పాలకవీడు జాన్‌పహాడ్‌ దర్గాలో దర్శనాలను నిలిపివేసినట్లు వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ మహమూద్‌, దర్గా ముజావర్‌ జాని తెలిపారు.

10 తర్వాత బయటకు రావద్దు : ఎస్పీ

సూర్యాపేట సిటీ : జిల్లా కేంద్రంలో స్పీ ఆర్‌.భాస్కరన్‌ బుధవారం లాక్‌డౌన్‌ అమలు తీరును పర్యవేక్షించారు.ప్రజలకు, పోలీసు సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. ఉదయం 6నుంచి 10గంటల వరకే వ్యాపార సముదాయాలు అందుబాటులో ఉంటాయని, తర్వాత సూచించారు. ఎవరూ బయటకు రావద్దని, మెడికల్‌ ఎమర్జెన్సీ అందుబాటులో ఉంటుందని చెప్పారు. అంతర్‌ జిల్లా సరిహద్దులు మూసివేసినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు వెళ్లేవారికి ఆన్‌లైన్‌ ద్వారా ఈపాస్‌ అందజేస్తామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా షిప్టుల వారీగా 24గంటలు పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. లాక్‌డౌన్‌ నియమాలను ప్రజలు, వ్యాపారులు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఉదయం వచ్చేవారు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు తప్పకుండా ధరించాలని అన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లాక్‌డౌన్‌కు సంపూర్ణ మద్దతు

ట్రెండింగ్‌

Advertisement