గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Jun 09, 2020 , 20:14:18

రోడ్డు విస్తరణకు ఇండ్లు ఖాళీ చేయాలి : కలెక్టర్‌

 రోడ్డు విస్తరణకు ఇండ్లు ఖాళీ చేయాలి : కలెక్టర్‌

చివ్వెంల : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం చందుపట్లలో రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోతున్న వారు ఖాళీ చేయాలని జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి గ్రామస్తులకు సూచించారు. మంగళవారం ఆయన చందుపట్లలో పర్యటించారు. సూర్యాపేట-ఖమ్మం జాతీయ రాహదారి విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డు వెడల్పు పనుల్లో ఇండ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించామని, వారు తమ ఇండ్లను స్వచ్ఛంగా ఖాళీ చేయాలని అన్నారు. అధికారులు దగ్గరుండి ఇండ్లు ఖాళీ చేయించి రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అదేశించారు.


logo