e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home నల్గొండ మొక్కలను కంటికి రెప్పలా కాపాడాలి

మొక్కలను కంటికి రెప్పలా కాపాడాలి

  • కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

చివ్వెంల, జూలై 26 : హరితహారంలో రోడ్ల వెంట నాటిన మొక్కలను రెండేండ్లపాటు కంటికి రెప్పలా కాపాడితే రహదారులన్నీ సుందరంగా మారుతాయని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మండల కేంద్రం శివారు నుంచి ఆత్మకూర్‌(ఎస్‌) మండలం ఏపూరు గ్రామం వరకు ఆర్‌ అండ్‌ బీ రోడ్డుకు ఇరువైపులా ఇటీవల నాటిన మొక్కలను సోమవారం వట్టి ఖమ్మంపహాడ్‌ శివారులో ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారులకు ఇరువైపులా ఖాళీ స్థలం లేకుండా మొక్కలు నాటాలన్నారు. వాటికి తప్పకుండా ట్రీగార్డులు, బ్రెష్‌ ఉడ్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు చివ్వెంల, ఆత్మకూర్‌(ఎస్‌) మండలాల అధికారులు సమన్వయంతో పనిచేసి మంచి పురోగతి సాధించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కె.జమలారెడ్డి, ఏపీఓ నాగయ్య, టీఏలు రమాదేవి, ఉదయశ్రీ, దుర్గాభవాని, విజయ్‌కుమార్‌, పంచాయతీ కార్యదర్శులు రజిని, గ్రీష్మ, అశోక్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

మొక్కలను రక్షించుకోవాలి
హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ రక్షించాలని ఎంపీడీఓ శ్రీనివాస్‌రావు అన్నారు. మండలంలోని బాలెంల, ఎర్కారం, రాజానాయక్‌తండా గ్రామాల వద్ద సూర్యాపేట – జనగాం రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను, ఏర్పాటు చేసిన ట్రీగార్డులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో, రహదారుల వెంట నాటిన మొక్కలను సంరక్షించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏఈ రాంబాబు, ఏపీఓ వెంకన్న, ఈసీ రమేశ్‌, సర్పంచ్‌ లునావత్‌ అశోక్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana