మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 14, 2020 , 19:19:19

అక్రమ వ్యాపారాలు మానుకోవాలి : ఎస్పీ భాస్కరన్‌

అక్రమ వ్యాపారాలు మానుకోవాలి : ఎస్పీ భాస్కరన్‌

హుజూర్‌నగర్‌ : అక్రమ వ్యాపారాలు, నేరాలను మానుకోవాలని సూర్యాపేట ఎస్పీ ఆర్‌ భాస్కర్‌ అక్రమార్కులను హెచ్చరించారు. శనివారం అర్ధరాత్రి హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని పోలీస్‌ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, అక్రమ వ్యాపారులు, నేరస్తుల వివరాలు, గ్రామాల దస్రాలను పరిశీలించారు.

హుజూర్‌నగర్‌ కేంద్రంగా జోరుగా అక్రమ వ్యాపారాలు సాగుతున్నాయని, ఎవరైనా అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు. పోసులు ఎవరైనా అక్రమ వ్యాపారాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వచ్చినా శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం నేరస్తులపై తీసుకోవాల్సిన చర్యల గురించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.


logo