e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 19, 2021
Home సూర్యాపేట జీవన ప్రమాణాలు మెరుగు పరచడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే శానంపూడి

జీవన ప్రమాణాలు మెరుగు పరచడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే శానంపూడి

గరిడేపల్లి: ప్రజా జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పుల్లమ్మ ప్రాం తంలో 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.1.50 లక్షలతో నిర్మిస్తున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో నెలకున్న సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేందుకు తగిన కృషి చేస్తానన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.

అబ్బిరెడ్డిగూడెంలో ఆరోగ్య ఉపకేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన

- Advertisement -

మండలంలోని అబ్బిరెడ్డిగూడెం గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్ర నిర్మాణానికి ఆదివారం హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఆకాంక్షతో సబ్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ దవాఖానలో కార్పోరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో వైద్య రంగానికి తగిన ప్రాధన్యతనిస్తున్నారన్నారు. అబ్బిరెడ్డిగూడెం గ్రామం నుంచి 11కేవీ లైన్ వెళ్లడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

అలాగే అబ్బిరెడ్డిగూడెం, పరెడ్డిగూడెం లింక్‌రోడ్డు నిర్మాణంతో పాటు బ్రిడ్జిని ఏర్పాటు చేస్తామన్నారు. చేపల చెరువు అలు గు వద్ద బ్రిడ్జిని నిర్మించి గ్రామస్తుల ఇబ్బందులను శాశ్వ తంగా తొలగించేందుకు కృషి చేస్తానన్నారు. అందరికి అందుబా టులో ఉంటూ గ్రామాల సమగ్రాభివృద్ధికి తోడ్పాటునందిస్తానన్నారు.

కార్యక్రమంలో హుజూర్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్‌ గౌడ్, జడ్పీటీసీ పోరెడ్డి శైలజ, గరిడేపల్లి సర్పంచ్ త్రిపురం సీతారాంరెడ్డి, ఎంపీటీసీ కడియం స్వప్న, సర్వారం పీఏసీఎస్ చైర్మన్ వీరంరెడ్డి శంభిరెడ్డి, గ్రామాధ్యక్షుడు ప్రతాని సైదులు, అబ్బిరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ చిలక కాశయ్య, అప్పన్నపేట ఎంపీటీసీ కడప ఇసాక్, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గుగులోతు కృష్ణానాయక్, గ్రామ పార్టీ అధ్యక్షుడు సల్లా నాగయ్య, టీఆర్‌ఎస్ నాయకులు ఉపేందర్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, దావాజీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement