e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home సూర్యాపేట 30 పంచాయతీలకు ఎన్నికలు

30 పంచాయతీలకు ఎన్నికలు

30 పంచాయతీలకు ఎన్నికలు

నల్లగొండ,మార్చి 27:నకిరేకల్‌ మండలంలో ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించని గ్రామపంచాయతీలతోపాటు ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే నిర్వహించిన స్థ్దానాల్లో ఖాళీలు ఏర్పడిన స్థానాల్లో ఎలక్షన్నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఆ మేరకు
శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏప్రిల్‌ 3 లోపు ఆయా గ్రామాల్లో ఓటర్ల జాబితా ప్రచురించి, అభ్యంతరాల స్వీకరణ, మార్పులు చేర్పుల అనంతరం 12న తుది జాబితా ప్రచురించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. అనంతరం ఎన్నికల నిర్వహణకు సంబంధించి తేదీలను ఖరారు చేయనున్నది.జిల్లాలో నకిరేకల్‌ మండలంలో ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించని గ్రామ పంచాయతీలతో పాటు ఇప్పటికే నిర్వహించిన స్థానాల్లో ఖాళీలు ఏర్పడిన ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది.

ఈ ఎన్నికల నిర్వహణకు శనివారం నోటిఫికేషన్‌ జారీచేసింది. నల్లగొండ జిల్లాలో 16 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీల్లో 651 వార్డులకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. సూర్యాపేట జిల్లాలో మూడు సర్పంచ్‌ స్థానాలతో పాటు 136 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక గ్రామ పంచాయతీకి సర్పంచ్‌ స్థాన ంతో పాటు 30 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. నల్లగొండ జిల్లాలో నకిరేకల్‌ మున్సిపాలిటీగా మారడంతో ఆ మున్సిపాలిటీలో విలీనం కాని ఏడు గ్రామ పంచాయతీలతో పాటు ఆయా కారణాలతో ఖాళీ అయిన మరో 13 (సూర్యాపేటలో మూడు, యాదాద్రిలో ఒకటి) సర్పంచ్‌ స్థ్దానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
‘నకిరేకల్‌’లో సాధారణ ఎన్నికలే..
2013 జూలైలో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌ ఎన్నికలు జరగ్గా 2018కి వారి పదవీ కాలం పూర్తయి ంది. ప్రత్యేక పాలన విధించిన సర్కార్‌ 2019 జనవరిలో మూడు దఫాలుగా జిల్లాలో ఎన్నికలు నిర్వహించింది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నకిరేకల్‌ మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలు మినహాయిస్తే 13 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినప్పటికీ వేర్వేరు కారణాలతో ఖాళీ కావడంతో ఎన్నికల కమిషన్‌ ఇక్కడ ఎన్నికలు జరుపడానికి ఏర్పాట్లు చేస్తుంది.
అయితే నకిరేకల్‌ మండలంలోని ఏడు గ్రామాలను 2013లో నకిరేకల్‌ పట్టణాన్ని మున్సిపాలిటీగా చేస్తూ ప్రభుత్వం అప్పట్లో నిర్ణయం తీసుకుంది. దీనికి అక్కడి ప్రజలు అంగీకరించకపోవడంతో 2015లో నకిరేకల్‌తో పాటు ఆయా గ్రామాల్లో సర్పంచ్‌ ఎన్నికలు జరిగాయి. వారి పదవీ కాలం ఇటీవల పూర్తి కావటంతో ఆ ఏడు గ్రామాల్లో సాధారణ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే వీటితో పాటే నకిరేకల్‌ మున్సిపాలిటీకి సైతం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
30 పంచాయతీలకు ఎన్నికలు

ట్రెండింగ్‌

Advertisement