రాకింగ్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌కి పరవశించని వారు ఉండరు. హీరోలని బట్టి బీట్స్ మార్చే దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఒకరిగా ఉన్నారు. ఆయన ఇటీవల ఉప్పెన సినిమాకు మంచి సంగీతం అందించగా అది సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప సినిమాకు సంగీతం సమకూరుస్తున్నాడు.
అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆర్య నుంచి సన్నాఫ్ సత్యమూర్తి వరకు కూడా ప్రతిదీ వీరి నుంచి స్పెషల్ ఆల్బమ్ గానే వచ్చాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్‌కి పండే అని చెప్పవచ్చు. అయితే తొలి సినిమా నుండి ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూ వస్తున్నారు వీరిద్దరు. తాజాగా డీఎస్పీకి స్పెషల్ గిఫ్ట్ పంపారు బన్నీ. ఇది చూసిన దేవి తెగ సంతోషించాడు. సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని తెలియజేస్తూ ఐకాన్ స్టార్ కి థాంక్స్ చెప్పాడు.