ఉద్యమకారులకు అండగా ఉంటాం

- హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి
హుజూర్నగర్, ఫిబ్రవరి 22: టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మలిదశ ఉద్యమకారులకు టీఆర్ఎస్ సభ్యత్వం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపుకోసం కృషిచేయాలన్నారు. హుజూర్నగర్ మున్సిపాలిటీలోని 24వ వార్డు కౌన్సిలర్ భవాని ఇటుక బట్టీల కూలీలకు సభ్యత్వాలు అందించారు. 10వ వార్డు లో కౌన్సిలర్ గుండా ఫణికుమారి ఎంపీపీ గూడెపు శ్రీనివాస్‌తో కలిసి సభ్యత్వ నమోదు చేపట్టారు. గరిడేపల్లి మండలం రాయినిగూడెంలో పార్టీ మండల కార్యదర్శి బెక్కం విజయ్‌కుమార్, మఠంపల్లి మండలం దొనబండ తండాలో పార్టీ మండలాధ్యక్షుడు కోలాహలం కృష్ణంరాజు, జడ్పీటీసీ జగన్నాయక్, చింతలపాలెం మండల పరిధిలోని కిష్టాపురంలో జడ్పీటీసీ చంద్రకళ, ఎంపీటీసీ చింతారెడ్డి ఆయా గ్రామాల నాయకులతో కలిసి సభ్యత్వాలను అందించారు. పాలకవీడు మండలాధ్యక్షుడు మలమంటి దర్గారావు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు నిర్వహించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనారవి, దొడ్డా నర్సింహారావు, చిలకరాజు అజయ్, పోనుగంటి వెంకన్న, వీరయ్య రాజు, పులిచింతల వెంకట్‌రెడ్డి, లింగయ్య, దేవదానం, వీరబాబు, శివభిక్షం, గోపయ్య పాల్గొన్నారు.
సభ్యత్వ పుస్తకాలు అందజేత
కోదాడ రూరల్ : దొరకుంట, కూచిపూడి, చిమిర్యాల గ్రామాల్లో చేపట్టిన సభ్యత్వ పుస్తకాలను ఆ మండల కేంద్రంలో మండలాధ్యక్షుడు భాస్కర్‌కు అందించారు.
కోదాడటౌన్ : కోదాడలో పీఏసీఎస్ చైర్మన్ ఆవుల రామారావు, పట్టణ ఉపాధ్యక్షుడు పాండు సభ్యత్వాన్ని స్వీకరించారు.
మోతెలో..
మోతె : మండల కేంద్రం, సర్వారం, కూడలి, కొత్తగూడెం, గొపతండా గ్రామా ల్లో సభ్యత్వ నమోదు చేపట్టారు. అనంతరం సభ్యత్వాలు చేయించిన పుస్తకాలను, బాధ్యులకు అందించారు. భట్టు శివాజీ నాయక్, మండలాధ్యక్షుడు శీలం సైదులు తదితరులు పాల్గొన్నారు
తాజావార్తలు
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఫోటోలు ఇలా డిలిట్
- పెట్టుబడిదారులకు లిటిల్ సీజర్స్ న్యూ బిజినెస్ ప్రపోజల్
- భారత్‌పై సైబర్ దాడుల వార్తలు నిరాధారం:చైనా
- అక్షరమై మెరిసెన్..సయ్యద్ అఫ్రీన్!
- ఆరోగ్యానికి..ప్రకృతి సూత్రం
- సేవలను విస్తరించిన సెటిల్
- రోబో-జోజో.. ఫ్రెండ్స్!
- పెట్రోల్ ధరల సెగ.. విద్యుత్ స్కూటర్లకు ఫుల్ డిమాండ్
- కార్న్ దోశ
- మహారాష్ట్రలో పది వేలకు చేరిన కరోనా కేసుల నమోదు