మువ్వన్నెల రెపరెపలు

- ఘనంగా గణతంత్ర వేడుకలు
బొడ్రాయిబజార్/ తిరుమలగిరి/ హుజూర్నగర్/ కోదాడ, 26 : జిల్లా వ్యాప్తంగా 72వ గణతంత్ర వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, సంస్థల్లో, ప్రజా, కార్మిక, కుల సంఘాల నాయకులు తమ వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించారు. చిత్రపటాలకు కోర్టుల ప్రాంగణంలో రెండో జిల్లా న్యాయమూర్తి కె.కళ్యాణ్‌చక్రవర్తి, ఛ్రుక్టరేట్లో అదనపు కలెక్టర్ పద్మజారాణి, ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఆర్.భాస్కరన్, జడ్పీ కార్యాలయంలో సీఈఓ విజయలక్ష్మి, ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ రాజేంద్రకుమార్, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ పి.రామానుజులరెడ్డి, మంత్రి క్యాంపు కార్యాలయంలో అదనపు వ్యక్తిగత కార్యదర్శి డీఎస్వీ శర్మ మువ్వన్నెల జెండాలను ఎగురవేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల 104 మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. కోర్టు చౌరస్తాలో భానుపురి మార్కెటింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 200 బాటసారులకు అన్నదానం చేశారు. కోదాడలోని టీఆర్ఎస్ కార్యాలయం, గాంధీపార్కులో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ జాతీయ జెండాను ఎగురవేశారు. మున్సిపల్ కార్యాలయంలో వాటర్ ట్యాంకు ట్రాక్టర్లను ప్రారంభించారు. కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి, ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కిశోర్‌కుమార్, టీఆర్ఎస్, మున్సిపల్ కార్యాలయాల్లో ఎమ్మెల్యే సైదిరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ వెంకారెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ అభివృద్ధి కార్యాలయంలో సీడీపీఓ విజయలక్ష్మి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి మువ్వన్నెల జెండాలను ఆవిష్కరించారు.
తాజావార్తలు
- వన్‌ప్లస్ 9 సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్
- వీడియో : కబడ్డీ ఆడిన నగరి ఎమ్మెల్యే రోజా
- మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి
- గుర్రంపై అసెంబ్లీకి వచ్చిన మహిళా ఎమ్మెల్యే
- మేఘన్‌కు సెరెనా విలియమ్స్ మద్దతు
- కోటాపై 50 శాతం పరిమితి : పున:సమీక్షించాలన్న సుప్రీంకోర్టు!
- నేనలా అనలేదు.. మీడియాలో తప్పుగా వచ్చింది: సీజే బొబ్డే
- హిందుస్థాన్ పెట్రోలియంలో ఇంజినీర్ పోస్టులు
- మహిళా దినోత్సవం : మగువలకు టెక్ దిగ్గజం బాసట!
- ఆరోగ్య కారణాలంటూ అభ్యర్థినిని తప్పించిన టీఎంసీ