శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Suryapet - Jan 24, 2021 , 01:24:34

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలతో..

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలతో..

బడుగు, బలహీనవర్గాలతోపాటు ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్కరికీ రిజర్వేషన్‌ కల్పించడం ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికతకు నిదర్శనమని ఓసీలు హర్షం వ్యక్తం చేశారు. 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల ప్రకటనను స్వాగతిస్తూ శనివారం సీఎం ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, సైదిరెడ్డి పాల్గొన్నారు. 

సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

మాడ్గులపల్లి, జనవరి 23 : ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌)కు పది శాతం రిజర్వేషన్లు ప్రకటించడం హర్షణీయమని టీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు. శనివారం ముఖ్యమంత్రి చిత్రపటానికి మండల కేంద్రంలో క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్‌ సభ్యుడు మహ్మద్‌ మోషన్‌ అలీ, నాయకులు పాలుట్ల బాబయ్య, మౌలాలి, సర్పంచ్‌ మారుతి వెంకట్‌రెడ్డి, కట్టా సిద్ధార్థరెడ్డి, ఏడుకొండలు, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

అగ్రవర్ణ పేదలకు వరం 

  • ఎమ్మెల్యే భాస్కర్‌రావు 

మిర్యాలగూడ, జనవరి 23 : రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగావకాశాల్లో లబ్ధిచేకూరేలా 10శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించడం హర్షణీయమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. శనివారం ఆయన పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. అగ్రవర్ణాల్లో చాలామంది నిరుపేదలకు ఈ రిజర్వేషన్లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తిరునగరు భార్గవ్‌, వైస్‌ చైర్మన్‌ కుర్ర కోటేశ్వర్‌రావు, గోవిందరెడ్డి, రజిని తదితరులు పాల్గొన్నారు. 

బలహీన వర్గాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

వేములపల్లి, జనవరి 23 : బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని సర్పంచ్‌ చిర్ర మల్లయ్య యాదవ్‌ అన్నారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు మద్దతుగా శనివారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఉపసర్పంచ్‌ అమిరెడ్డి పద్మ, టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు పుట్టల పౌల్‌, వార్డు సభ్యులు ఉగ్గె మునీశ్వర్‌, పందిరి ప్రతాప్‌, మాలి శంకర్‌రెడ్డి, రవి, శ్రీనివాస్‌రెడ్డి, దుర్గారెడ్డి, ఆరీఫ్‌, శంకర్‌, దామోదర్‌రెడ్డి, గోపాల్‌, జానయ్య, సత్యం, నారాయణ, యాదగిరిరెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎంతో మందికి మేలు 

  • ఎమ్మెల్యే శానంపూడి

హుజూర్‌నగర్‌, జనవరి 23 : ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం హుజూర్‌నగర్‌లోని ఇందిరాసెంటర్‌లో సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుతో రాష్ట్రంలో ఎంతో మందికి మేలు జరుగుతుందన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గెల్లి అర్చనారవి, వైస్‌చైర్మన్‌ జక్కుల నాగేశ్వరరావు, నేరేడుచర్ల వైస్‌ చైర్మన్‌ శ్రీలత, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు చిట్యాల అమర్‌నాథరెడ్డి, దొంతగాని శ్రీనివాస్‌, అట్లూరి హరిబాబు, ముడెం గోపిరెడ్డి పాల్గొన్నారు. 

VIDEOS

logo