ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

- కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
- ఇంటింటికీ వెళ్లి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే
- మార్చి 15వరకు కొనసాగనున్న కార్యక్రమం
కోదాడ, జనవరి 23 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలకు ఏ మేరకు అందుతున్నాయో తెలుసుకునేందుకు, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకునేందుకు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ శ్రీకారం చుట్టారు. కోదాడ మున్సిపాలిటీతోపాటు నియోజకవర్గవ్యాప్తంగా పల్లెల్లో పర్యటించేందుకు నడుం బిగించారు. ఇందులో భాగంగా శనివారం మున్సిపాలిటీలోని 30వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ, కౌన్సిలర్ పెండెం వెంకటేశ్వర్లుతో కలిసి ఇంటింటికీ తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, పింఛన్లు తదితర అంశాలపై వృద్ధులు, మహిళలు తమ సమస్యలను తెలిపారు. మార్చి 15వరకు కొనసాగనున్న పర్యటనకు తొలిరోజు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. 4గంటలపాటు వీధులన్నీ తిరిగి సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే, ఓ వృద్ధురాలు నడుమ సంభాషణ ఇలా..
ఎమ్మెల్యే : అమ్మా..! పింఛన్ అందుతున్నదా?
వృద్ధురాలు : కేసీఆర్ సారు దయ వల్ల నెలనెలా అందుతుందయ్యా.
ఎమ్మెల్యే : కొడుకులు బాగా చూసుకుంటున్నారా?
వృద్ధురాలు : బాగానే చూసుకుంటున్నారయ్యా. ఇల్లు కూడా మంజూరు చేస్తే మిమ్మల్ని తలుచుకుంటానయ్యా.
ఎమ్మెల్యే : ఈ విడుత మంజూరు కాగానే తప్పనిసరిగా ఇప్పిస్తానమ్మా.
వృద్ధురాలు : నువ్వు సల్లగుండాలయ్యా.
ఎమ్మెల్యే : నీ సమస్య ఏమిటమ్మా?
మహిళ : మంచి నీళ్లు సరిగా రావడం లేదు. దోమల బెడదతో తట్టుకోలేకపోతున్నాం.
ఎమ్మెల్యే : ఇప్పటివరకు పైపులైను ఎందుకు వేయలేదు. దోమల మందు పిచికారీ ఎందుకు చేయలేదు. తక్షణమే మంచినీరు అందేలా చూడాలి.(ఇలా అధికారులను ఎమ్మెల్యే మందలించారు)
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, వైస్ చైర్పర్సన్ పద్మామధుసూదన్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నాగేశ్వర్రావు, మహిళా విభాగం అధ్యక్షురాలు రోజారమణి, సింగిల్ విండో చైర్మన్ ఆవుల రామారావు, కేఎల్ఎన్ ప్రసాద్, రహీం, ఉపేందర్, శ్రీనివాస్‌యాదవ్, కోటేశ్వర్రావు, రాయపూడి వెంకటనారాయణ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- భార్యతో గొడవ.. గొంతు కోసుకున్న భర్త
- ఖలిస్తాన్ గ్రూపుల బెదిరింపు : కెనడాలో హిందువులపై దాడుల పట్ల ఆందోళన
- పేదల కోసం ఎంజీఆర్ ఎంతో చేశారు : ప్రధాని మోదీ
- గర్భిణి చితిలో బంగారం కోసం సెర్చ్.. నలుగురు నిందితులు అరెస్ట్
- కోచింగ్ సెంటర్ విద్యార్థులకు కొవిడ్ టెస్టులు తప్పనిసరి
- మరో హాస్పిటల్‌కు టైగర్ వుడ్స్ తరలింపు
- ఆస్కార్ రేసులో ఆకాశం నీ హద్దురా.. ఆనందంలో చిత్ర బృందం
- లవర్‌తో గొడవ.. ఆటోలో నుంచి దూకిన యువతి
- కోదాడలో ప్రేమజంట ఆత్మహత్య
- బెజ్జూర్‌లో పెద్దపులి కలకలం