శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Suryapet - Jan 24, 2021 , 01:13:09

ఆయిల్‌పామ్‌ సాగుతో అధిక లాభాలు

ఆయిల్‌పామ్‌ సాగుతో అధిక లాభాలు

  • రాష్ట్ర ఉద్యానశాఖ డైరెక్టర్‌ వెంకట్రామిరెడ్డి

మునగాల, జనవరి 23 : నీటి ఎద్దడితోపాటు నీటి లభ్యత ప్రాంతాల్లోనూ ఆయిల్‌పామ్‌ సాగు చేయవచ్చని రాష్ట్ర ఉద్యానశాఖ డైరెక్టర్‌ వెంకటరామిరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో మునగాలవాసి, భద్రాచలం కలెక్టర్‌ ముస్కుల వెంకట్‌రెడ్డి సాగు చేస్తున్న ఆయిల్‌పామ్‌ తోటను సందర్శించి మాట్లాడారు. తోట చుట్టూ వరి పొలాలు సాగు చేసినప్పటికీ  ఆశించిన దిగుబడి వస్తుందన్నారు. ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ సాగుకు   ప్రాధాన్యమిస్తుందని, రైతులు సాగు చేసి అధిక లాభాలు పొందాలని సూచించారు. జిల్లా ఉద్యాన అధికారి శ్రీధర్‌, జగన్‌, వై.సైదులు. వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  


VIDEOS

logo