శనివారం 27 ఫిబ్రవరి 2021
Suryapet - Jan 23, 2021 , 01:56:09

ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

  • కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

సూర్యాపేట,  22 : రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం క్యాంపు కార్యాలయంలో రవాణా శాఖ అధికారులతో కలిసి వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు విస్తృత ప్రచారం చేయాలన్నారు. ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించాలని,   తనిఖీ చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రధాన కూడళ్లలో  నివారణ  ఏర్పాటు చేయాలని సూచించారు.   రవాణా శాఖాధికారి సుభాశ్‌, ఎంవీఐ వీరేంద్రనాయక్‌, శ్రీకాంత్‌ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

‘రోడ్డు భద్రత’  ఆవిష్కరణ 

తిరుమలగిరి, జనవరి 22 : మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో శుక్రవారం ఎస్‌ఐ డేనియల్‌కుమార్‌ రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ట్రాఫిక్‌ నిబంధనలను అందరూ పాటించాలని,  మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని సూచించారు. 

ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన 

నాగారం, జనవరి 22 :ట్రాఫిక్‌  ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సీఐ తూల శ్రీనివాస్‌ అన్నారు. సూర్యాపేట - జనగాం జాతీయ రహదారిపై వాహనదారులకు అవగాహన కల్పించారు.  డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన పత్రాలు కలిగి ఉండాలని, వేగ నియంత్రణ పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ పెదమంచి హరికృష్ణ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

VIDEOS

logo