శుక్రవారం 05 మార్చి 2021
Suryapet - Jan 23, 2021 , 01:56:06

భక్తిశ్రద్ధలతో గంధోత్సవం

భక్తిశ్రద్ధలతో గంధోత్సవం

అర్వపల్లి, జనవరి 22 : అర్వపల్లి చిన్న దర్గా ఉర్సు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సయ్యద్‌ ఖాజా నసీరుద్దీన్‌బాబా దర్గా సమీపంలోని  జాన్‌పాక్‌ షహీద్‌, సయ్యద్‌ ఖాజా మొయినొద్దీన్‌ బాబా దర్గా ఉత్సవాలు ఏటా జాన్‌పహాడ్‌ సైదులు ఉర్సు రోజే  శుక్రవారం ముతవలీ హబీబ్‌ ఆధ్వర్యంలో గంధం ఊరేగింపు నిర్వహించారు. పెద్ద దర్గా నుంచి గంధాన్ని తీసుకొచ్చి చిన్న  సమాధులపై చల్లి ప్రార్థనలు చేశారు. జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌, ఎంపీటీసీ  పద్మశ్రీనివాస్‌  ఊరేగింపులో పాల్గొన్నారు.

మైబూబా ఉత్సవాలు ప్రారంభం

పెన్‌పహాడ్‌, జనవరి 22  మండలంలోని దూపహాడ్‌లో మైబూబా దర్గా ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.  దర్గా నుంచి   పూలు, దట్డీలు, జెండాలను  తీసుకొచ్చి గ్రామ శివారులోని  సమాధిపై ఉంచారు.  దర్గా నుంచి వచ్చిన ముజావర్లు ప్రార్థనలు చేశారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు గంధాన్ని తాకేందుకు పోటీపడ్డారు. దర్గా పక్కన వెలిసిన నాగదేవత పుట్టకు భక్తులు పసుపు, కుంకుమ, పూలు, గుడ్లు ఉంచి, కోళ్లు బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు.  వెంకటేశం, హుస్సేన్‌, గుర్వయ్య, సైదులు, లక్ష్మీనారాయణ, సందీప్‌ పాల్గొన్నారు. 

దంతాల  ఉర్సులో గంధం ఊరేగింపు

సూర్యాపేట రూరల్‌, జనవరి 22 : కాసరబాద గ్రామ సమీపంలోని  దర్గా ఉత్సవాలు శుక్రవారం తెల్లవారుజామున  కాసరబాద  దంతాల కుటుంబ  గంధాన్ని ఊరేగింపుగా దర్గా వద్దకు తీసుకొచ్చి ప్రార్థనలు చేశారు.   దట్టీలను సమాధులపై కప్పి పూలతో అలంకరించారు. అనంతరం భక్తులు జంతు బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు.  కొల్లు రేణుక, ఎంపీటీసీ బంటు నాగమ్మ, దర్గా నిర్వాహకులు దంతాల వెంకన్న, రమేశ్‌  పాల్గొన్నారు.

VIDEOS

logo