కొవిడ్ వ్యాక్సిన్‌పై అపోహలొద్దు

- టీకా తీసుకున్నవారు ఆందోళన చెందొద్దు
- సూర్యాపేట డీఎంహెచ్ఓ హర్షవర్ధన్
చివ్వెంల/ నూతనకల్/ ఆత్మకూర్(ఎస్), జనవరి 21 : కరోనా వ్యాక్సిన్‌పై అపోహలొద్దని, ప్రతిఒక్కరూ తప్పకుండా వేయించుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు. చివ్వెంల, నూతనకల్, ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ను గురువారం టీకా వేయించుకున్న ఆరోగ్య, అంగన్వాడీ సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత సురక్షితమైన ఈ టీకా త్వరలో అందరికీ అంబాటులోకి వస్తుందన్నారు. టీకా వేసుకున్న వారు భయాందోళన చెందొద్దని సూచించారు. టీకా వచ్చిందని అశ్రద్ధ కరోనా పతిఒక్కరూ పాటించాలని పేర్కొన్నారు. జిల్లాలో మొదటి విడుతలో 4400 మందికి టీకా వేయాలని ప్రభుత్వ లక్ష్యమని, ఇప్పటి వరకు 2500 వేశారని తెలిపారు. అధిక రక్తపోటు, మధుమేహం, ఇతర సమస్యలున్న వారు కూడా టీకా వేసుకోవచ్చని, గర్భిణులు, బాలింతలు వేసుకోవద్దని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో ఆర్బీఎస్ జిల్లా అధికారి కళ్యాణ్ చక్రవర్తి, మండల వైద్యాధికారులు విజయసారధి, త్రివేణి, సీహెచ్ఓ ఆవుల వెంకటేశ్వర్లు, హెల్త్ సూపర్వైజర్లు శేషయ్య, శిరోమణి, రంగమ్మ, శ్యాంకుమార్, ఆరోగ్య అధికారులు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆన్లైన్లోనే నామినేషన్లు వేయొచ్చు!
- భాగ్యశ్రీ అందానికి ఫిదా అవ్వాల్సిందే..వీడియో
- పంజాబ్‌లో కనిపించిన యూఎఫ్‌వో.. వీడియో వైరల్
- గుర్తు తెలియని వాహనం ఢీకొని.. ఇద్దరు యువకులు మృతి
- ఫైజర్ వ్యాక్సిన్ సింగిల్ డోస్‌తో వైరస్ సంక్రమణకు చెక్!
- ఐదు రాష్ట్రాల ఎన్నికలు: గంటసేపు పొలింగ్ పొడిగింపు
- సీఆర్పీఎఫ్ జవాన్లకు సైనిక హెలికాప్టర్ సదుపాయం
- ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలి..
- 4 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల
- తుపాన్‌ను ఢీకొట్టిన బస్సు..9 మంది మహిళలకు గాయాలు