శనివారం 27 ఫిబ్రవరి 2021
Suryapet - Jan 22, 2021 , 01:55:19

టీకాను సద్వినియోగం చేసుకోవాలి : డీఐఓ

టీకాను సద్వినియోగం చేసుకోవాలి : డీఐఓ

తుంగతుర్తి, జనవరి 21 : కరోనా టీకాను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ ఇమ్యూనిటీ ఆఫీసర్‌  వెంకటరమణ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో గురువారం సుమారు 130మంది అంగన్‌వాడీ సిబ్బందికి టీకాలు వేశారు. వ్యాక్సినేషన్‌ను ఆయన పరిశీలించి మాట్లాడారు. టీకా తీసుకున్న ప్రతిఒక్కరూ 30 నిమిషాలపాటు రెస్ట్‌ రూంలో ఉండాలన్నారు. కొందరికి నొప్పులు, జ్వరం లక్షణాలు ఉంటాయని,   హానీ   ప్రభుత్వం అందిస్తున్న ఉచిత టీకాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా టీబీ నియంత్రణాధికారి చంద్రశేఖర్‌, ప్రభుత్వ వైద్యులు  రామకృష్ణ, సముద్రాల సూరి, యాదగిరి, నర్సింహాచారి, భారతి, ఉపేంద్ర, సునీత తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo