సోమవారం 08 మార్చి 2021
Suryapet - Jan 20, 2021 , 01:26:18

కరోనా టీకాపై అపోహలొద్దు

కరోనా టీకాపై అపోహలొద్దు

  • డీఎంహెచ్‌ఓ కర్పూరం హర్షవర్ధన్‌ 

కోదాడ/హుజూర్‌నగర్‌/తిరుమలగిరి/ బొడ్రాయిబజార్‌, జనవరి 19 : కరోనా టీకాపై అపోహ లొద్దని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి హర్ష వర్ధన్‌ అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానతోపాటు అనంతగిరి, మునగాల పీహెచ్‌సీల్లో టీకా పంపిణీని పరిశీలించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ నిరంజన్‌, జిల్లా ప్రత్యేకాధికారి కళ్యాణ్‌ చక్రవర్తి ఉన్నారు.  జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీల్లో  ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు టీకాను ప్రారంభించారు. సూర్యాపేట పట్టణంలోని 6వ వార్డు గిరినగర్‌ అర్బన్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్‌లో వ్యాక్సినేషన్‌ను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ ప్రారంభించారు.  నేరేడుచర్ల, పెంచికల్‌దిన్నె పీహెచ్‌సీల్లో జిల్లా మలేరియా అధికారి సాహితి ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు.

VIDEOS

logo