శనివారం 06 మార్చి 2021
Suryapet - Jan 19, 2021 , 00:43:52

ప్రజారోగ్యమేప్రభుత్వ ధ్యేయం

ప్రజారోగ్యమేప్రభుత్వ ధ్యేయం

  •  టీకా కేంద్రం ప్రారంభంలో ఎమ్మెల్యే మల్లయ్య

కోదాడ  జనవరి 18: కరోనా నుంచి ప్రజలను రక్షించడమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ పేర్కొన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనపర్తి శిరీషతో కలిసి టీకా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్యశాల సూపరింటెండెంట్‌ రజినికి తొలి టీకా వేశారు. తొలిరోజు 50మంది వైద్య సిబ్బందికి టీకా వేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం వైద్యశాలలో అత్యవసర విభాగాన్ని ప్రారంభించి ప్రసవించిన మహిళకు కేసీఆర్‌ కిట్‌ అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ నిరంజన్‌, జిల్లా దవాఖానల సమన్వయకర్త వెంకటేశ్వర్లు, జిల్లా ప్రత్యేక పరిశీలకుడు కళ్యాణ్‌ చక్రవర్తి, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ వెంపటి పద్మ, కమిషనర్‌ మల్లారెడ్డి, తాసీల్దార్‌ శ్రీనివాసశర్మ, వైద్యాధికారులు సూరజ్‌, ధర్మతేజ, విజయ్‌, ఝాన్సీ, అశోక్‌, స్వప్న, శైలజ, సుధీర్‌ చక్రవర్తి పాల్గొన్నారు.

60మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ 

హుజూర్‌నగర్‌, జనవరి 18 : హుజూర్‌నగర్‌లో 20మందికి, గరిడేపల్లిలో 40మందికి కొవిడ్‌  వేశారు. కార్యక్రమాల్లో జిల్లా ప్రోగ్రాం అధికారి సాహితి, హుజూర్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కడియం వెంకట్‌రెడ్డి, ఎంపీపీ పెండెం సుజాత, ఇన్‌చార్జి ఎంపీడీఓ వనజ, ఎంపీఓ లావణ్య, సర్పంచ్‌ టి.సీతారాంరెడ్డి, ఎంపీటీసీ స్వప్న, వైద్యాధికారి రమ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.సూర్యాపేట పట్టణంలోని 17వ వార్డు అంబేద్కర్‌నగర్‌  హెల్త్‌ సెంటర్‌లో కరోనా  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ ప్రారంభించారు. ఆత్మకూర్‌(ఎస్‌) పాథమిక ఆరోగ్య కేంద్రంలో సర్పంచ్‌ తంగెళ్ల వీరారెడ్డి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు.   వర్కర్‌ కొల్లు మాధవి, డాక్టర్‌ ఆనంద్‌కుమార్‌  వేయించుకున్నారు. జిల్లా వ్యాక్సిన్‌ అబ్జర్వర్‌ విజయ, ఎంపీడీఓ మల్సూర్‌నాయక్‌, ఎంఈఓ ధారాసింగ్‌, సీహెచ్‌ఓ ఆవుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. చివ్వెంల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ ధరావత్‌ కుమారిబాబూనాయక్‌, జడ్పీటీసీ భూక్యా సంజీవ్‌నాయక్‌ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. టీకా  ప్రతిఒక్కరూ తప్పకుండా వేయించుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శ్రీనివాసరాజు సూచించారు. తాసీల్దార్‌ శేషగిరిరావు, ఎంపీడీఓ జమలారెడ్డి, వైద్యాధికారి డాక్టర్‌ ప్రదీప్తకుమార్‌, ఎంఈఓ గోపాల్‌రావు పాల్గొన్నారు. 

VIDEOS

logo