శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Suryapet - Jan 17, 2021 , 02:54:30

సైకోను పట్టించిన సీసీ కెమెరా

సైకోను పట్టించిన సీసీ కెమెరా

  • కోదాడలోని శ్రీనివాసనగర్‌లో వ్యక్తి హల్‌చల్‌
  • సీసీ పుటేజీ ఆధారంగా పట్టుకున్న పోలీసులు

కోదాడటౌన్‌,జనవరి16: పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో శనివారం తెల్లవారుజామున  సైకో హల్‌చల్‌ చేశాడు. ఒంటరి మహిళలున్న ఇళ్లను టార్గెట్‌ చేసుకున్న అతను తలుపు నెట్టి ఇంట్లోకి ప్రవేశించి మహిళల గొంతు నులిమేందుకు యత్నించాడు. కాలనీలోని మూడు ఇళ్లల్లో చొరబడి మహిళలను భయభ్రాంతులకు గురి చేశాడు. వారు కేకలు వేయడంతో పారిపోయాడు. కాలనీవాసులు సైకోను వెంబడించగా వాళ్లపై రాళ్లతో దాడిచేసి పారిపోయాడు. స్థానికుల ఫిర్యాదుతో టౌన్‌ ఎస్‌ఐ రవీందర్‌ కాలనీని సందర్శించారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. అందులో లభించిన ఆధారాలతో పట్టణంలో గాలించి అతడిని పట్టుకున్నారు. నిందితుడు మస్తాన్‌గా గుర్తించినట్లు ఎస్‌ఐ తెలిపారు. కాలనీవారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అన్ని కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. 

VIDEOS

logo