శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Suryapet - Jan 17, 2021 , 02:54:29

సూర్యాపేట చైతన్యాన్ని కాపాడుకుందాం

సూర్యాపేట చైతన్యాన్ని కాపాడుకుందాం

  • కళాభారతి నిర్మాణానికి చర్యలు
  • మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట టౌన్‌, జనవరి 16 : సాహిత్య ఉద్యమంలో సూర్యాపేటకు ఎంతో ప్రాధాన్యం ఉందని,  చైతన్యాన్ని నిలుపుకొనేందుకు కృషి చేయాలని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేటకు చెందిన యానాల యాదిరెడ్డి రచించిన ‘60 ఏండ్ల పాలకంకుల పరిగ’ సంకలనంతోపాటు డేగల జనార్దన్‌ రూపొందించిన కర్నల్‌ సంతోష్‌బాబు సంచికలను  తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి   సంకలనాలు  స్ఫూర్తిదాయకంగా నిలిచేవే అన్నారు. సూర్యాపేట.. మొదటి నుంచి సాహిత్యానికి ముందు వరుసలో నిలిచిందని,  ప్రస్థానాన్ని కొనసాగించేందుకు జిల్లా కేంద్రంలో  ఆడిటోరియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌,  రాంచంద్రారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, పుస్తక రచయితలు యానాల యాదిరెడ్డి, డేగల జనార్దన్‌, రాంబాబు శర్మ, గణేశ్‌, అమరేందర్‌రెడ్డి, ఇరిగి  పాల్గొన్నారు.   

VIDEOS

logo