వైద్య సిబ్బందికి మొదటి టీకా సంతోషకరం

- కరోనా వ్యాక్సినేషన్లో ఎమ్మెల్యే సైదిరెడ్డి
హుజూర్నగర్, జనవరి 16 : కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ముందుండి నడిపించిన వైద్య సిబ్బందికి తొలి వ్యాక్సిన్ వేయడం సంతోషకరమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఏరియా దవాఖానలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యాధి విజృంభణ సమయంలో వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది చూపిన తెగువ మరువలేనిదని కొనియాడారు. వారు ప్రాణాలను లెక్కచేయకుండా అందించిన సేవలతోనే నియోజకవర్గంలో కరోనాను అరికట్టగలిగామన్నారు. అనంతరం మండల వైద్యాధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ తొలిరోజు 30మందికి టీకా వేసినట్లు తెలిపారు.
అనంతరం పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంప్‌లో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చనారవి, వైస్‌చైర్మన్ జక్కుల నాగేశ్వర్రావు, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, జడ్పీటీసీ సైదిరెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి అమర్, సూపరింటెండెంట్ కరణ్‌కుమార్, దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
వ్యాక్సిన్ రావటం శుభపరిణామం
కరోనా నివారణ వ్యాక్సిన్‌ను తొలిసారిగా వేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. మన దేశ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనుగొనేందుకు ఎంతో శ్రమించారు. కరోనా నియంత్రణలో వైద్య, ఆరోగ్య శాఖల సిబ్బంది సేవలను గుర్తించి ముందు టీకా మాకే వేయాలనే నిర్ణయం చాలా గొప్పది. మిగతా దేశాలతో పోల్చితే మన దేశం కేవలం పది నెలల్లోనే వ్యాక్సిన్ రూపొందించడం అభినందనీయం.
నాగునాయక్, ఎల్టీ, హుజూర్నగర్
ఏమాత్రం భయపడొద్దు
కరోనా వైరస్ నివారణ టీకా రాదేమోనని భయపడ్డాను. టీకా వేసుకున్నాక ఎలాంటి ఇబ్బంది పడలేదు. టీకా వేసుకునేందుకు ఎవ్వరూ జంకొద్దు. ప్రభుత్వం దశలవారీగా అందరికీ టీకా అందుబాటులోకి తేనున్నది. ముందుగా వైద్యారోగ్యశాఖలో పని చేసే వారికి టీకా వేయడం అభినందనీయం.
- ఉదయ్‌కుమార్, పేషెంట్ కేర్ టేకర్, హుజూర్నగర్
తాజావార్తలు
- పేదల కోసం ఎంజీఆర్ ఎంతో చేశారు : ప్రధాని మోదీ
- గర్భిణి చితిలో బంగారం కోసం సెర్చ్.. నలుగురు నిందితులు అరెస్ట్
- కోచింగ్ సెంటర్ విద్యార్థులకు కొవిడ్ టెస్టులు తప్పనిసరి
- మరో హాస్పిటల్‌కు టైగర్ వుడ్స్ తరలింపు
- ఆస్కార్ రేసులో ఆకాశం నీ హద్దురా.. ఆనందంలో చిత్ర బృందం
- లవర్‌తో గొడవ.. ఆటోలో నుంచి దూకిన యువతి
- కోదాడలో ప్రేమజంట ఆత్మహత్య
- బెజ్జూర్‌లో పెద్దపులి కలకలం
- అక్షర్‌తో పాండ్యా ఇంటర్వ్యూ.. కోహ్లీ ఏం చేశాడో చూడండి
- సీపీఐ సీనియర్ నేత పాండియన్ కన్నుమూత