శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Suryapet - Jan 17, 2021 , 02:54:27

చిన్ని మెదడుకు పెద్ద కష్టం

చిన్ని మెదడుకు పెద్ద కష్టం

  • స్పర్శ లేక, స్పందన లేక  ఇబ్బంది పడుతున్న బాలుడు
  • దాతలు సహకరించాలని తల్లిదండ్రుల వేడుకోలు 
  • నైవేద్య నిధి ఫౌండేషన్‌ ఆర్థిక సాయం

బొడ్రాయిబజార్‌, జనవరి 16 : చిన్ని మెదడుకు పెద్ద కష్టమే వచ్చిపడింది. ఆ చిన్నారి పుట్టినప్పటి నుంచి స్పర్శ తెలియకపోవడం, స్పందించే గుణం లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు తిరుగని దవాఖాన లేదు. పెద్ద పెద్ద దవాఖానలకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకున్నారు తప్ప పిల్లవాడిలో మార్పు రాకపోవడంతో ఆ తల్లిదండ్రులు వేదన అరణ్యరోదనే అవుతున్నది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడకు చెందిన అమిత్‌, కాజోల్‌ దంపతుల కుమారుడు రియాన్షికి పుట్టుకతోనే మెదడులో ఫంక్షన్స్‌ దెబ్బతిన్నాయి. దీంతో ఏడేండ్ల వయసు వచ్చినా స్పర్శలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటివరకు రూ.4 లక్షలు ఖర్చుచేశారు. ఈ వ్యాధికి ముంబైలో చికిత్స కోసం రూ.5 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు.   ఆపరేషన్‌ కోసం దాతలు సహకరించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. వివరాలకు 9346701794 నంబర్‌ను సంప్రదించాల్సిందిగా కోరారు.  

నైవేద్య నిధి సాయం..  

రియాన్షి పరిస్థితిని గమనించిన సూర్యాపేటలోని జమ్మిగడ్డకు చెందిన నైవేద్యనిధి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు వరిపెల్లి సంధ్య రూ.25 వేల సాయాన్ని శనివారం వారి నివాసంలో లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు గండూరి కృపాకర్‌ చేతుల మీదుగా అందజేశారు. బాబు విషయాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. రూ.5 వేలతోపాటు బస్తా బియ్యం అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ పగిళ్ల సుమిలాగన్నారెడ్డి, పెండెం చంద్రశేఖర్‌, లక్ష్మయ్య, మిట్టపల్లి రమేశ్‌, విద్యాసాగర్‌, హరీశ్‌పిళ్లె,  క్రాంతి, పవన్‌కుమార్‌, రాకేశ్‌రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీను, భిక్షం పాల్గొన్నారు.

VIDEOS

logo