బుధవారం 27 జనవరి 2021
Suryapet - Jan 14, 2021 , 01:12:49

ప్రైవేట్‌ ఉపాధ్యాయులను ఆదుకోవడం అభినందనీయం

ప్రైవేట్‌ ఉపాధ్యాయులను ఆదుకోవడం అభినందనీయం

  • మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి  

బొడ్రాయిబజార్‌ , జనవరి 13 : కరోనాతో  ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్‌ ఉపాధ్యా యులను ఆదుకోవడం అభినందనీయమని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఇటీవల మృతి చెందిన గండూరి ప్రీతమ్‌ జోన్‌ జ్ఞాపకార్థం లయన్స్‌క్లబ్‌ అధ్య క్షుడు గండూరి కృపాకర్‌ ఆధ్వర్యంలో 100 మంది ప్రైవేట్‌ ఉపాధ్యాయుకు బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌,  మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఉప్పల లలితాఆనంద్‌, కౌన్సిలర్‌ గండూరి పావనీ కృపాకర్‌,  గండూరి ప్రకాశ్‌, పెండెం చంద్రశేఖర్‌, నూకల వెంకటరెడ్డి, ఇరిగి కోటేశ్వరి, రమేశ్‌, డాక్టర్‌ దుర్గాబాయ్‌, శ్రీను  తదిత రులు పాల్గొన్నారు. 

విజేతలకు బహుమతులు

సూర్యాపేట 26వ వార్డులో కౌన్సిలర్‌ నిమ్మల స్రవంతీశ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన  ముగ్గుల పోటీలను మంత్రి జగదీశ్‌రెడ్డి బుధవారం సాయంత్రం  పరిశీలించి విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. అనంతరం  నాగులమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  

మంత్రిని కలిసిన టీఎన్‌జీఓ నాయకులు 

తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం జిల్లా నాయకులు  మంత్రి జగదీశ్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌.కే.జానీమియా, దున్న శ్యాం, పి.అనంతరావు, షేక్‌ హుస్సేన్‌, గామయ్య, ఆకాశ్‌వర్మ, గద్దల నరేశ్‌, నరేందర్‌, బచ్చలకూర శ్రీనాథ్‌  తదితరులు పాల్గొన్నారు. 

టీఎంఎస్‌టీఏ డైరీ ఆవిష్కరణ

 టీఎంఎస్‌టీఏ 2021 డైరీ, క్యాలెండర్‌ను మంత్రి జగదీశ్‌రెడ్డి స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.  కార్యక్రమంలో మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులు బీ.ఎస్‌. గౌడ్‌, గురుచరణ్‌, శ్రీను, మల్లయ్య, దశరథ, మధు, వీరభద్రం, సలీమ్‌ పాల్గొన్నారు.  

ఉర్సుకు రావాలని ఆహ్వానం 

పాలకవీడు : జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సుకు హాజరు కావాలని కోరుతూ  మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌కు బుధవారం ఆహ్వానపత్రం అం దించినట్లు దర్గా ముజావర్‌ జానీ తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 22న జరిగే గంధోత్సవం కార్యక్రమానికి తప్పక హాజరవ్వాల్సింగా కోరినట్లు చెప్పారు.  

సమస్యలు పరిష్కరించాలని  వినతి

నాగారం : జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో   మంత్రి జగదీశ్‌రెడ్డికి  సూర్యాపేటలో  వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అరుణ్‌, శోభన్‌బాబు, నాగరాజు, సూర్య, నవీన్‌, మధు, అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు 


logo