సోమవారం 08 మార్చి 2021
Suryapet - Jan 14, 2021 , 01:12:46

భోగి వేడుకలు

భోగి వేడుకలు

  • అలరించిన రంగవల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు 
  • పలు ఆలయాల్లో గోదా, రంగనాయకుల కల్యాణం 
  • ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ పూజలు  

హుజూర్‌నగర్‌/కోదాడ, జనవరి 13 : హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల వ్యాప్తంగా బుధవారం భోగి వేడుకలు అంబరన్నాంటాయి. ఉదయాన్నే భోగి మంటలు వేశారు. వాకిళ్లలో రంగవల్లులు, గొబ్బెమ్మలను అందంగా తీర్చిదిద్దారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు సంక్రాంతి శోభకు మరింత వన్నె తెచ్చాయి. ధనుర్మాసాల్లో భాగంగా పలు దేవాలయాల్లో గోదా, రంగనాయకుల కల్యాణోత్సవాలు కనులపండువగా జరిగాయి. పలుచోట్ల  ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌, ఇందిర దంపతులు హాజరై పూజలు చేశారు. వేడుకల సందర్భంగా ఆలయాలు కిటకిటలాడాయి. అనంతరం అన్నదానాలు నిర్వహించారు.  


VIDEOS

logo