క్రీడలతో మానసికోల్లాసం

హుజూర్నగర్ రూరల్/కోదాడటౌన్, జనవరి 12 : క్రీడలతో శారీరక, మానసికోల్లాసం కలుగుతుందని ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, జడ్పీటీసీ సైదిరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని లింగగిరిలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి ఆటల పోటీలను ఎస్ఐ వెంకట్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అలాగే కోదాడలోని భవానీనగర్‌లో క్రికెట్ పోటీలను మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష ప్రారంభించారు. కార్యక్రమాల్లో సర్పంచ్ అంజిరెడ్డి, ఎంపీటీసీ విజయలక్ష్మి, కాసర్ల నాగేశ్వర్రావు, కౌన్సిలర్లు లక్ష్మీప్రసన్న, గుండెల సూర్యనారాయణ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వర్రావు, ప్రమీలాశ్రీపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
బొడ్రాయిబజార్, జనవరి 12 : జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ఆవరణలో 29వ వార్డుకు చెందిన ఎస్కే జానీ జ్ఞాపకార్థం మంగళవారం పారేపల్లి ఉపేందర్ ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో నిర్వాహకులు పారెపల్లి ఉపేందర్, కౌన్సిలర్లు అనంతుల యాదగిరి, రాపర్తి శ్రీనివాస్, ఎస్కే తాహేర్‌పాషా, బత్తుల జానీ, టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, రమాకిరణ్, శ్రవణ్ పాల్గొన్నారు.
కబడ్డీ పోటీలు
మద్దిరాల, జనవరి 12 : మండలంలోని చిన్ననెమిల గ్రామంలో నేండ్ర సోమిరెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన గ్రామస్థాయి కబడ్డీ పోటీలను తుంగతుర్తి సీఐ రవి మంగళవారం ప్రారంభించారు. ఎస్ఐ సాయిప్రశాంత్, రాష్ట్ర యువజన నాయకుడు నేండ్ర మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ రావుల వెంకన్న, శివయ్య పాల్గొన్నారు.
మహ్మదాపురంలో..
పెన్‌పహాడ్, జనవరి 12 : సంక్రాంతి సందర్భంగా మండలంలోని మహ్మదాపురంలో ఫైటర్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను స్థానిక ఎంపీటీసీ కొండేటి మంగళవారం ప్రారంభించారు. ఉపసర్పంచ్ వెంకన్న, భూక్యా లాలు, సందీప్ రాథోడ్, నెమ్మాది వీరబాబు, సంపత్, నగేశ్, గోపి, సతీశ్, నరేశ్, వెంకన్న పాల్గొన్నారు.
నేడు జిల్లా స్థాయి ఆటల పోటీలు
మద్దిరాల, జనవరి 12 : సంక్రాంతి పండుగ సందర్భంగా మండలంలోని చందుపట్లలో బుధవారం అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ యాస రాంకుమార్ తెలిపాడు. ముగ్గుల పోటీలు, పతంగులు ఎగురవేయడం, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రతిస్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్ బహుమతులు అందజేస్తామని
పేర్కొన్నారు
తాజావార్తలు
- రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ట్రయల్ రన్
- రాష్ట్రంలో 40 డిగ్రీలకు చేరువలో ఎండలు
- 28-02-2021 ఆదివారం.. మీ రాశి ఫలాలు
- షీ టీమ్స్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిరుద్యోగులకు.. కొలువులు
- అతివేగం.. ప్రాణం తీసింది
- మెరుగైన సేవలకు.. చేతులు కలపండి
- పారిశ్రామిక పురోభివృద్ధిలో మేడ్చల్
- సఫారీ టూర్.. మరింత కొత్తగా
- హైదరాబాద్ స్టార్టప్‌కు ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్ అవార్డు
- రూ.60 లకు తిన్నంత బిర్యానీ