Suryapet
- Dec 29, 2020 , 01:26:06
VIDEOS
‘బ్రుసెల్లోసిస్' టీకాల పంపిణీ పరిశీలన

కోదాడ రూరల్ : జీవాల్లో వ్యాపించే బ్రుసెల్లోసిస్ వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని వెటర్నరీ బయోలాజికల్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ జాయింట్ డైరెక్టర్ మల్లేశ్వరి సోమవారం పరిశీలించారు. మండలంలోని దొరకుంటలో మండల పశువైద్యాధికారి ఆధ్వర్యంలో చేపట్టిన టీకాల పంపిణీని ఆమె పరిశీలించి మాట్లాడుతూ బ్రుసెల్లోసిస్ అనే వ్యాధి బ్యాక్టిరియా కారణంగా సోకుతుందని, దీని నివారణకు 3 నుంచి 8నెలల వయసు కలిగిన ఆవు, బర్రెదూడలకు టీకాలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. మండల పశువైద్యాధికారి డా॥ నాగేంద్రబాబు, డా॥ వీరారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING