శనివారం 06 మార్చి 2021
Suryapet - Dec 18, 2020 , 01:14:44

సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి

సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి

  • సూర్యాపేట జడ్పీ చైర్‌పర్సన్‌ దీపికాయుగంధర్‌రావు

సూర్యాపేట : దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికాయుగంధర్‌రావు అన్నారు. గురువారం జడ్పీ కార్యాలయంలో ఉదయం 1,7వ స్థాయీ సంఘాలు, మధ్యాహ్నం 2, 4వ స్థాయీ సంఘాల సమావేశాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలో రైతులు పందిరిసాగుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నందున రైతులు వినియోగించుకొని అధికంగా కూరగాయలు పండించాలని సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, స్టాండింగ్‌ కమిటీల సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.  

VIDEOS

logo