మంగళవారం 19 జనవరి 2021
Suryapet - Dec 05, 2020 , 03:18:44

ఈ-నామ్‌తో రైతులకు ప్రయోజనం

ఈ-నామ్‌తో రైతులకు ప్రయోజనం

  •  మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ లలితాదేవి 

సూర్యాపేట అర్బన్‌ : ఈ-నామ్‌ విధానం ద్వారా రైతులు పండించిన పంటలను ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉంటుందని,  రైతులకు ప్రయోజనం చేకూరుతుందని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఉప్పల లలితాఆనంద్‌ అన్నారు.  అభివృద్ధిపై నాగార్జున ఫర్టిలైజర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్యర్యంలో మార్కెట్‌లో ట్రేడర్లు, కమీషన్‌దారులు,  శుక్రవారం ఏర్పాటు చేసిన వెబ్‌నార్‌లో ఆమె మాట్లాడారు. ఈ-నామ్‌ ఉపయోగించుకునే విధానం, మద్దతు ధరలు, ఉత్పత్తులను నిల్వ చేసుకునే విధానం, గేట్‌ ఎంట్రీలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారన్నారు. మార్కెట్‌కు రైతులు ధాన్యం తీసుకొచ్చిన తరువాత ట్రేడర్లు, కమీషన్‌ ఏజెంట్లు, దడువాయిలు తీసుకోవాల్సిన చర్యలపై సూచించినట్లు తెలిపారు.   సిబ్బంది రాజు, ఖాసీం, పుష్పలత, శ్రవణ్‌, సుధీర్‌, పర్వతాలు, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.