సోమవారం 18 జనవరి 2021
Suryapet - Dec 04, 2020 , 02:14:32

పల్లె.. ప్రకృతి

పల్లె.. ప్రకృతి

  • పార్కుల ఏర్పాటుతో 
  • ఆహ్లాదకరంగా గ్రామాలు 
  • 658చోట్ల వేగంగా పనులు 
  • ప్రారంభానికి సిద్ధంగా 300 పార్కులు 
  • ప్రకృతి వనాలు పల్లెలకు వన్నె 

తెస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలోని 707 పంచాయతీలు, ఆవాసాల్లో ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం కాగా.. 658 చోట్ల పనులు వేగంగా సాగుతున్నాయి. 300పార్కులు తుదిదశలో ఉన్నాయి. మొత్తంగా వాటిల్లో  సుమారు 7.08లక్షల మొక్కలు నాటుతున్నారు. వాకింగ్‌ ట్రాక్‌తోపాటు చుట్టూ పచ్చదనం ఉట్టిపడేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

  • పల్లెకు వన్నె తెస్తున్న పకృతి వనాలు
  • పార్కులతో ఆహ్లాదకరంగా గ్రామాలు 
  • ‘పేట’ జిల్లాలో 707 పార్కుల ఏర్పాటు.. 
  • 658 చోట్ల పనులు ప్రారంభం 
  • 300లకు పైగా ప్రారంభానికి సిద్ధం

సూర్యాపేట : పట్టణాల్లోనే కాదు.. పల్లెల్లో సైతం పచ్చని ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం కల్పించేందుకు సర్కారు చర్యలు చేపడుతున్నది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంతోపాటు ఆవాసాల్లోనూ పల్లె ప్రకృతి వనాల పేరుతో పార్కుల నిర్మాణం చేపట్టింది. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాలో 475 గ్రామపంచాయతీలు, 232 ఆవాస గ్రామాల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నది.గ్రామంలో  ప్రభుత్వ స్థలాన్ని  20 గుంటల నుంచి ఎకరం స్థలం వరకు ఉండేలా ప్రణాళికలు తయారు చేసుకొని పనులు ప్రారంభించారు. 20 గుంటల స్థలంలో 2వేల మొక్కలు నాటడమే కాకుండా మధ్యలో పార్కు, వాకింగ్‌ ట్రాక్‌తోపాటు చుట్టూ  ఏర్పాటు చేస్తున్నారు. పార్కులోకి ప్రవేశించడానికి ద్వారం, దానికి బోర్డు పెడుతున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం నిధులు కేటాయించింది. 20 గుంటల స్థలంలో ఏర్పాటు చేస్తే రూ.4.13 లక్షలు, 30 గుంటల్లో అయితే రూ.5.30లక్షలు, ఎకరం భూమిలో ఏర్పాటు చేస్తే రూ.6.17 లక్షలు కేటాయించింది. ఒక్కొక్క పార్కులో 35 రకాల మొక్కలు పెంచాలని నిర్ణయించగా.. అందులో  చెట్లతోపాటు ఆయుర్వేద, పూల  పెడుతున్నారు.

తుది దశలో 300 పార్కులు..

సూర్యాపేట జిల్లాలోని 23 మండలాల పరిధిలో 707 పార్కులను ఏర్పాటు చేస్తుండగా..  పార్కులు తుది మెరుగులు దిద్దుకొని ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. 140 పార్కుల్లో మొక్కలు నాటి చుట్టూ కంచె ఏర్పాటు చేశారు.  నిర్మాణ  ఉన్నాయి.  చోట్ల భూమి లెవలింగ్‌లో, 19 ఫిట్టింగ్‌ వర్క్‌లో, 18 చోట్ల మెక్కలు నాటి ఇతర పనులు చేసే దశలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 49 చోట్ల స్థలాలు దొరకక  ప్రారంభం కాలేదు. ఇటీవలే  చోట్ల స్థల సేకరణ పూర్తి కాగా.. ఇంకా 21 చోట్ల స్థల సేకరణ చేయాల్సి ఉంది. 

నెంబర్‌ వన్‌ స్థానంలో హుజూర్‌నగర్‌..

పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో సూర్యాపేట జిల్లాలో హుజూర్‌నగర్‌ మండలం నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. మండలంలో 14 ప్రకృతి వనాలు  చేయాలని నిర్ణయించగా.. అన్ని పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. చివ్వెంల మండలంలో 66 పార్కుల నిర్మాణం కోసం అంచనాలు వేయగా.. ఇంకా 18 చోట్ల పనులు ప్రారంభం కాలేదు. కొన్ని చోట్ల స్థల సమస్యలు ఉండగా.. ఇటీవల  జగదీశ్‌రెడ్డి చొరవతో వాటిని అధిగమించారు. 17 మండలాల్లో 70 శాతానికి పైగా పనులు పూర్తి కాగా.. మిగిలిన మండలాల్లో 60 శాతంలోపు పనులు అయ్యాయి. మఠంపల్లి మండలంలో ప్రకృతి వనాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. 

నెలాఖరుకు పనులు పూర్తి చేస్తాం

జిల్లాలో పల్లె ప్రకృతి వనాల పనులు వేగంగా జరుగుతున్నాయి.  వ్యాప్తంగా 707 వనాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం 48 మినహా అన్ని చోట్లా పనులు జరుగుతున్నాయి. సుమారు 300 పార్కులు తుది దశలో ఉన్నాయి. వీటిని త్వరలోనే ప్రారంభిస్తాం. స్థలం సమస్యలున్న చోట ప్రజాప్రతినిధుల సహకారంతో  పనులు చేపడుతున్నాం. మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి క్షుపత్యేక శ్రద్ధ తీసుకొని పనులను వేగంగా  నెలాఖరు వరకు దాదాపు పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నాం. 

- సుందరి కిరణ్‌కుమార్‌, 

జిల్లా గ్రామీణాభివృద్ధి  సూర్యాపేట