మంగళవారం 19 జనవరి 2021
Suryapet - Dec 03, 2020 , 02:38:50

ఉపాధి కూలీలకు రూ. 91 కోట్ల వేతనాలు చెల్లింపు

ఉపాధి కూలీలకు రూ. 91 కోట్ల వేతనాలు చెల్లింపు

  • డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్‌ 

నేరేడుచర్ల : ఉపాధి హామీ పథకం కింద ఈనెల చివరి వరకు 96లక్షల పని దినాలు కల్పించాల్సి ఉండగా ఇప్పటి వరకు 70లక్షల పనిదినాలు కల్పించి రూ.91కోట్ల వేతనాలు చెల్లించినట్లు డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఉపాధిహామీ పనులపై బుధవారం స్థానిక స్త్రీశక్తి భవన్‌లో నేరేడుచర్ల, పాలకవీడు మండలాల కార్యదర్శలకు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 2021 వరకు 118 లక్షల పనిదినాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జాబ్‌కార్డు కల్గిన కుటుంబాలకు పని కల్పించాల్సిన బాధ్యత కార్యదర్శులపై ఉందన్నారు. ప్రభుత్వం చేపట్టే పథకాలు అర్హులకు అందేలా చూడాలన్నారు. కూలీలకు పనిదినాలు కల్పించేందుకు గ్రామాల్లో సర్వే నిర్వహించి వారికి పని చూపించాలన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో నేరేడుచర్ల, పాలకవీడు ఎంపీడీఓలు ఉపేందర్‌రెడ్డి, జానయ్య, ఎంపీఓలు విజయకుమారి, దయాకర్‌, ఏపీఓ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.  

గరిడేపల్లి : మండలంలోని ఉపాధి కూలీలకు పని కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సుందరి కిరణ్‌కుమార్‌ సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధీ హామీ పనులపై పంచాయతీ కార్యదర్శులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీపీ పెండెం సుజాతాశ్రీనివాస్‌గౌడ్‌, ఇన్‌చార్జి ఎంపీడీఓ వనజ, ఎంపీఓ పి.లావణ్య, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.