శుక్రవారం 22 జనవరి 2021
Suryapet - Dec 03, 2020 , 02:32:29

రెడ్లకుంటలో ఇసుక డంప్‌లపై అధికారుల విచారణ

రెడ్లకుంటలో ఇసుక డంప్‌లపై అధికారుల విచారణ

కోదాడ రూరల్‌: మండలంలోని రెడ్లకుంట గ్రామంలో 500 ట్రక్కుల ఇసుక డంపింగ్‌ అంటూ సోషల్‌ మీడియాలో వచ్చిన వార్తలకు స్పందించిన తాసీల్దార్‌ జె.శ్రీనివాసశర్మ, పంచాయతీరాజ్‌ డీఈ, ఏఈ లక్ష్మారెడ్డి, రూరల్‌ ఎస్‌ఐ వై. సైదులు బుధవారం గ్రామాన్ని సందర్శించి ఇసుక డంప్‌లను పరిశీలించారు. గ్రామంలో   67 ట్రక్కుల ఇసు క, పలువురి ఇండ్ల వద్ద 32 ట్రక్కుల ఇసుకను గుర్తించారు. గ్రామంలో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైన్లు, డంపింగ్‌యార్డ్‌, శ్మశానం, ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి నిమిత్తం పీఆర్‌ డీఈ వద్ద నుంచి 60 ట్రిప్పులకు 45 ట్రిప్పులకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. అదనంగా ఉన్న 39 ట్రిప్పుల్లో గృహనిర్మాణాలకు పోను మిగిలిన 20 ట్రక్కుల ఇసుకను సీజ్‌ చేసినట్లు తెలిపారు. 


logo