శుక్రవారం 22 జనవరి 2021
Suryapet - Dec 02, 2020 , 01:27:25

ఇసుక తరలింపుపై వివాదం

 ఇసుక తరలింపుపై వివాదం

కోదాడ రూరల్‌: పాలేరు వాగు నుంచి ఇసుక తరలింపు పోలీసులు, రెడ్లకుంట గ్రామస్తులకు మధ్య వివాదంగా మారింది. మండలంలోని రెడ్లకుంట గ్రామానికి చెందిన రైతు ఇంటి పనుల నిమిత్తం పాలేరు వాగు నుంచి ట్రాక్టర్‌తో ఇసుకను తరలిస్తుండగా అనుమతులు లే కుండా  తరలించొద్దంటూ పోలీసులు అడ్డుకోవడంతో వివాదం ఏర్పడింది. గ్రామ సర్పం చ్‌ వందల ట్రక్కుల ఇసుక తరలిస్తున్నా పట్టించుకోని వారు తమ ఇంటి పనులకు ఇసుక తోలుకుంటే పట్టుకోవడం అన్యాయమని పోలీసులతో వాగ్వాదానికి దిగి రోడ్డుపై బైఠాయించారు. సమాచారం తెలుసుకున్న రూరల్‌ ఎస్‌ఐ సైదులు గ్రామానికి చేరుకుని ఇసుక తరలింపుపై సమగ్ర విచారణ చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని సర్ధి చెప్పారు.  అనం తరం పాలేరు వాగు నుంచి ఇసుకతో వస్తున్న ట్రాక్టర్‌పై కేసు నమోదు చేశారు.

అనుమతితోనే ఇసుక తరలింపు  

గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రెవెన్యూ అధికారుల అనుమతులతోనే ఇసుక తరలిస్తున్నామని సర్పంచ్‌ సాధినేని లీలా తెలిపారు.   logo