ఆదివారం 17 జనవరి 2021
Suryapet - Dec 01, 2020 , 03:11:44

పౌరహక్కులపై అవగాహన కలిగి ఉండాలి

పౌరహక్కులపై అవగాహన కలిగి ఉండాలి

  • ఎంపీపీ జ్యోతి, జడ్పీటీసీ కవిత 

నడిగూడెం/కోదాడ రూరల్‌/హుజూర్‌నగర్‌రూరల్‌/మునగాల/పాలకవీడు : ప్రతి ఒక్కరూ పౌరహక్కులపై అవగాహన కలిగి ఉండాలని నడిగూడెం ఎంపీపీ యాతాకుల జ్యోతి, జడ్పీటీసీ బాణాల కవిత అన్నారు. సోమవారం మండలంలోని తెల్లబల్లిలో పౌరహక్కుల దినోత్సవం పురస్కరించుకొని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందని, హక్కులపై అవగాహన ఉన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుందన్నారు. అనంతరం పల్లెప్రకృతి వనంలో మొక్కలు నాటారు. అలాగే కోదాడ మండలం కూచిపూడిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవితారెడ్డి పౌరహక్కులపై అవగాహన కల్పించారు.  ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు దళితుల భూములను ఎంపిక చేయొద్దని  పలువురు దళిత రైతులు  కవితారెడ్డికి విన్నవించారు. అలాగే హుజూర్‌నగర్‌ మండలం కరక్కాయలగూడెంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ గూడెపు శ్రీనివాస్‌, మునగాల మండలం మాధవరంలో తాసీల్దార్‌ కరుణశ్రీ, పాలకవీడు మండలం అలింగాపురంలో అదనపు గిర్ధావర్‌ జానీపాష  పాల్గొని పౌరహక్కులపై అవగాహన కల్పించారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ మందలపు కృష్ణకుమారిశేషు, తాసీల్దార్‌ జవహర్‌లాల్‌, వైస్‌ ఎంపీపీ బడేటి వెంకటేశ్వర్లు, ఎంపీఓ లింగారెడ్డి,  సర్పంచులు దేవబత్తిని వెంకటనర్సయ్య, శెట్టి సురేశ్‌నాయుడు, కీత జయమ్మ, నంద్యాల విజయలక్ష్మి, కొత్తా భిక్షమమ్మ, ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ  సైదులు, ఆర్‌ఐ కళ్యాణి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.