సెలవు రోజూ కొనుగోళ్లు..

- మార్కెట్ చైర్పర్సన్ చొరవతో ధాన్యం
- రైతులకు ఇబ్బందులు
సూర్యాపేట అర్బన్ : నివర్ తుఫాన్ ప్రభావంతో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు సోమవారం వరకు సెలవులు ప్రకటించారు. రైతుల ఇబ్బందుల కమిటీ చైర్పర్సన్ లలితాదేవి చొరవతో ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. కారణంగా అధికారులు మార్కెట్కు మూడ్రోజులు ప్రకటించి కొనుగోళ్లు ఆపేశారు. అయితే.. విషయం తెలియక కొంతమంది రైతులు మార్కెట్కు ధాన్యం తీసుకొచ్చారు. సుమారు 15వేల బస్తాల ధాన్యం వచ్చింది. సోమవారం వరకు సెలవులు ఉండడంతో ధాన్యం అమ్మకానికి మంగళవారం వరకు వేచి ఉండాల్సి వస్తుందని రైతులు ఆందోళనకు గురయ్యారు. రైతుల ఇబ్బందులను గ్రహించిన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ట్రేడర్లతో మాట్లాడి కొనుగోళ్లు జరిగేలా చూశారు. శనివారం మార్కెట్లో ఉన్న ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయడంతో సంతోషం చేశారు.
రైతులకు ఇబ్బంది ..
మార్కెట్కు సోమవారం వరకు సెలవులు ఉండడంతో ధాన్యం తెచ్చిన రైతులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇబ్బందులు లేకుండా చేసేందుకు సెలవు అయినప్పటికీ ధాన్యాన్ని కొనుగోలు చేయించాం. ఇక నుంచి ట్రేడర్లు, కమీషన్దారుల సెలవు రోజుల్లో రైతులు ధాన్యం తీసుకురాకుండా తీసుకుంటాం. మంగళవారం నుంచి మార్కెట్లో యథావిధిగా కార్యకలాపాలు కొనసాగుతాయి.
- ఉప్పల లలితాదేవి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్
తాజావార్తలు
- ఆ నలుగురు కరోనా టీకా వల్ల చనిపోలేదు: కేంద్ర ఆరోగ్య శాఖ
- అమెరికాలో సరికొత్త రోజు : జో బైడెన్
- స్పెయిన్లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
- దీర్ఘకాలిక వీడ్కోలు కాదు.. తాత్కాలికమే : డోనాల్డ్ ట్రంప్
- బైడెన్ ప్రమాణ స్వీకారానికి ఒబామా, క్లింటన్, బుష్
- ట్రాఫిక్ నిర్వహణపై జీహెచ్ఎంసీ సమావేశం
- బైక్ను ఢీకొన్న లారీ.. దంపతుల సహా మరో మహిళ మృతి
- 18 నెలలపాటు వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేత
- ‘క్రాక్’ సినిమాలో రవితేజ కొడుకుగా నటించిన బుడ్డోడెవరో తెలుసా..?
- ‘ది బీస్ట్’.. బైడెన్ ప్రయాణించే కారు విశేషాలు ఇవే..