గురువారం 04 మార్చి 2021
Suryapet - Nov 29, 2020 , 01:06:41

భర్తపై భార్య యాసిడ్‌తో దాడి

భర్తపై భార్య యాసిడ్‌తో దాడి

మతిస్థిమితం సరిగా లేదంటున్న కుటుంబ సభ్యులు

కోదాడ రూరల్‌ : అనుమానం, దానికితోడు సరైన మతిస్థిమితం లేని ఓ మహిళ తన భర్తపై యాసిడ్‌తో దాడికి పాల్పడింది. ఈ సంఘటన  పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణం  చెందిన గంగవరపు నర్సింహారావు ట్రాక్టర్‌ నడుపుతూ జీవిస్తున్నాడు. అతనికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొడుకుల వివాహాలు జరిగి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. కుమారులు దూరంగా ఉండడం, భర్త ట్రాక్టర్‌ నడిపేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట గడపడంతో లక్ష్మి మానసికంగా ఒత్తిడికి గురైంది. దీనికితోడు  మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను దూరం పెడుతున్నాడని అనుమానించి అతనిపై ద్వేషం పెంచుకుంది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా రాత్రివేళల్లో పిచ్చిగా ప్రవర్తిస్తున్నది. ఈ క్రమంలో శనివారం ఉదయం ఇంటి ముందు నిలబడి ఉన్న భర్తపై బాత్రూం క్లీన్‌ చేసే యాసిడ్‌తో ముఖంపై దాడి చేసి కొడవలితో దాడికి పాల్పడింది. కళ్లల్లో యాసిడ్‌ పడడంతో నర్సింహారావు కేకలు వేయగా ఇరుగుపొరుగు వారు వచ్చి ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. అనంతరం ప్రైవేటు దవాఖానకు తరలించారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన లక్ష్మి ఇంటి నుంచి పారిపోయింది. ప్రస్తుతం నర్సింహారావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. బాధితుడి కుమారుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితురాలిని కోర్టులో హాజరు పరిచినట్లు పట్టణ ఎస్‌ఐ రవీందర్‌ తెలిపారు.

తల్లి మానసిక స్థితి అంతంత మాత్రమే..

నా తల్లి కొంతకాలంగా అర్ధరాత్రి పూట అరుపులు, కేకలతో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుంది. వైద్య పరీక్షలు చేయించాలని పలువురు వైద్యులు సూచించారు. పరీక్షలకు ఆమె పూర్తిగా సహకరించకుండా పిచ్చిగా ప్రవర్తిస్తుంది. వారం రోజుల క్రితం హైదరాబాద్‌లో తన పాప పుట్టినరోజు ఫంక్షన్‌లో సైతం పిచ్చిగా ప్రవర్తించింది. పిల్లలు దూరంగా ఉండటంతో ఆమె మానసిక స్థితి బాగాలేక మా నాన్నపై దాడికి పాల్పడింది.

- రాజు, బాధితుడి కుమారుడు


VIDEOS

logo