సోమవారం 18 జనవరి 2021
Suryapet - Nov 27, 2020 , 01:28:24

‘కేంద్రం’పై కర్షకుల కన్నెర్ర

‘కేంద్రం’పై  కర్షకుల కన్నెర్ర

  • ప్రజా  విధానాలపై నిరసన
  • సార్వత్రిక సమ్మె విజయవంతం

బొడ్రాయిబజార్‌, సూర్యాపేట అర్బన్‌, ఆత్మకూర్‌ (ఎస్‌), చివ్వెంల,పెన్‌పహాడ్‌,  తుంగతుర్తి,  నూతనకల్‌ : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికులు, కర్షకులు కన్నెర్ర చేశారు.  ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులను, కార్మిక వ్యతిరేక నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. వామపక్షాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో  చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో  అన్ని మండలాల్లో నిరసనలు తెలిపారు. సూర్యాపేట  వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు.    ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి కొత్త బస్టాండ్‌ వరకు సుమారు 200 ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్‌  కార్మికులు  బహిష్కరించి కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఆయా పార్టీల నాయకులు, ఆర్టీసీ కార్మికులు   ఎదుట నిరసన తెలిపారు.  (ఎస్‌) మండలంలోని నెమ్మికల్‌ గ్రామంలో సూర్యాపేట - దంతాలపల్లి ప్రధాన రహదారిపై వామపక్షాలు, రైతుసంఘాల ఆధ్వర్యంలో రాస్తారాకో నిర్వహించారు.    వివిధ గ్రామాల్లో సీపీఐ, సీపీఎం, యూసీసీఆర్‌ఐ ఎంఎల్‌ పార్టీల నాయకులు రాస్తారోకోలు  పెన్‌పహాడ్‌   సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.  మండల కేంద్రంలో  ఏఐటీయూసీ, టీఆర్‌ఎస్‌కేవీ   వ్యక్తం చేశారు.  మండల కేంద్రంతోపాటు డి.కొత్తపల్లి గ్రామాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో సూర్యాపేట - జనగాం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నూతనకల్‌ మండల కేంద్రంలో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో, తిరుమలగిరి మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో  వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకోలు నిర్వహించారు. 

కార్యక్రమాల్లో   న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శులు మల్లు నాగార్జున్‌రెడ్డి,  ఎం.డేవిడ్‌కుమార్‌, న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం నాయకులు కొత్తపల్లి శివకుమార్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి దండ వెంకటరెడ్డి, టీఆర్‌ఎస్‌కేవీ ఆటో యూనియన్‌ అధ్యక్షుడు కుర్రి సైదులు, ప్రధాన కార్యదర్శి ఎస్‌కే  ప్రజాసంఘాల నాయకులు దంతాల రాంబాబు, బుద్ద సత్యనారాయణ, ముల్కలపల్లి రాములు, నెమ్మాది వెంకటేశ్వర్లు, చామకూరి నర్సయ్య, మట్టిపల్లి సైదులు, వెంకట్‌రెడ్డి, కోట గోపి, జె.నరసింహారావు, ఆర్టీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.