కదం తొక్కిన కార్మిక లోకం

కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపాటు
కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల వ్యాప్తంగా సమ్మె విజయవంతం
కోదాడ రూరల్ : కార్మిక, కర్షక వ్యతిరేక చట్టాలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ కార్మికులు, కార్మిక సంఘాలు కోదాడ నియోజవర్గవ్యాప్తంగా కదం తొక్కాయి. కోదాడ పట్టణంతోపాటు మునగాల, నడిగూడెం, మోతె, చిలుకూరు, అనంతగిరి, కోదాడ మండలాల్లో నిరసనలు తెలిపారు. కోదాడ పట్టణంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, టీఎన్టీయూసీ సంఘాల ఆధర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రంగా థియేటర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎం.శ్రీనివాసరావు, వాడపల్లి వెంకటేశ్వర్లు, చింతకుంట లక్ష్మీనారాయణరెడ్డి, ముల్కలపల్లి రాములు, ఓరుగంటి ప్రభాకర్, కొల్లు వెంకటేశ్వర్రావు, బుర్రి శ్రీరాములు, దేవర వెంకట్‌రెడ్డి, మేదరమెట్ల వెంకటేశ్వర్రావు, వెంకట్, సీతారాం, బెల్లంకొండ సత్యనారాయణ, గుండు నాగేశ్వర్రావు, దున్న శ్రీనివాస్, మల్లెల వెంకన్న, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్మికులు, కర్షకులు, యువజన, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
హుజూర్నగర్ నియోజకవర్గంలో..
హుజూర్నగర్ : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్కేవీ, సీపీఎం, సీపీఐ, ఏఐటీయూసీ, కాంగ్రెస్, టీడీపీ, లంబాడీ కుల సంఘం సభ్యులు, ఐఎఫ్టీయూ, సీఐటీయూ, ఐన్టీయూసీ, వాటి అనుబంధ కార్మిక సంఘాల అధ్వర్యంలో బంద్, రాస్తారోకోలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను ఉపసంహరించుకోవాలన్నారు. ఈ సందర్భంగా హుజూర్‌నగర్‌లోని పాత బస్టాండ్ నుంచి ఇందిరాసెంటర్ వరకు, చింతలపాలెంలోని అంబేద్కర్ సెంటర్లో, మఠంపల్లి, నేరేడుచర్ల, పాలకీడు, గరిడేపల్లిలోని ప్రధాన రహదారులపై రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ నియోజకవర్గ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్, లతీఫ్, రోషపతి, మేకల నాగేశ్వర్రావు, జడ శ్రీనివాస్, గురువయ్య, బాబు, గుండు వెంకటేశ్వర్లు, పాండు, సైదా, మల్లయ్య, రామకృష్ణ, రవి, జగన్మోహన్రెడ్డి, శంభయ్య, బాలూనాయక్, పుల్లయ్య, వీరబాబు, శ్రీనివాస్‌యాదవ్, బాషా, ఉస్సేన్, పున్నయ్య, పాండునాయక్, కొణతం చిన వెంకట్‌రెడ్డి, రవి, ధనుంజయనాయుడు, రమేశ్, నగేశ్, అనంతప్రకాశ్, మట్టేశ్, జోజిరెడ్డి, సైదులు, ఏసురత్నం, కామళ్ల నవీన్, యాకూబ్, ముత్యాలు, అంజన్‌రెడ్డి, గణేశ్, రమణ, సైదమ్మ, వట్టెపు సైదులు, వెంకన్న, ఆదినారాయణ, మదార్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- నాలా ప్రహరీ నిర్మాణానికి రూ. 68 కోట్లు
- టీకా వచ్చిందిగా ఢోకా లేదిక
- దేశం గర్విస్తుంది : గవర్నర్
- సర్కారు స్థలాలు కబ్జా చేస్తే సహించేది లేదు
- సేవలోనే ఆనందం
- నిర్భయంగా.. వ్యాక్సిన్ వేసుకోండి!!
- ఆరోగ్యానికి లైవ్ చేపలే మేలు
- వ్యాక్సిన్‌పై భయం వద్దు
- నంబర్ప్లేట్లు లేని వాహనాలకు జరిమానా
- విడుతల వారీగా అందరికీ వ్యాక్సిన్