నివర్ తుఫాన్ ముప్పు తప్పినట్లే!

- ఊపిరి పీల్చుకున్న రైతులు, అధికారులు
- కట్టుదిట్టమైన చర్యలతో నష్ట నివారణ
సూర్యాపేట, నమస్తే తెలంగాణ : బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించినప్పటికీ గురువారం దాని ప్రభావం జిల్లాపై పెద్దగా చూపించలేదు. తుఫాన్ హెచ్చరికలతో చేతికివస్తున్న పంటలు, కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో భారీగా నిల్వ ఉన్న ధాన్యానికి ముప్పు వాటిల్లుతుందని రైతాంగం, అధికార యంత్రాంగం ఆందోళన చెందింది. అయితే తుఫాన్ బలహీన పడడం, దాని ప్రభావం లేకపోవడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు చిరుజల్లులు కురిశాయి. ముందస్తుగానే తుఫాన్ హెచ్చరికలు ఉండడంతో ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లోని ధాన్యం రాశులపై టార్బాలిన్లు కప్పాలని కలెక్టర్లు ఆదేశాలు జారీచేయడం, మార్కెట్లకు పత్తి, ధాన్యం తీసుకురావద్దని సూచించడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కల్లాలలో ఉన్న ధాన్యం సైతం తడువకుండా రైతులు టార్బాలిన్లు కప్పుకున్నారు. మొత్తం మీద తుఫాన్ ప్రభావం పెద్దగా లేకపోవడంతో రైతులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
నీలగిరిలో వర్షం..
రామగిరి: అల్పపీడన ప్రభావంతో గురువారం వాతావారణం పూర్తిగా చల్లబడింది. చిరుజల్లులతోపాటు వర్షం పడింది. అంతేకాకుండా సాయంత్రం నుంచి మొదలైన ముసురు రాత్రి వరకు కురుస్తుండటంతో వివిధ పనులపై బయటకు వెళ్లిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు చలి సైతం పెరుగడంతో అవస్థలు పడ్డారు.
తాజావార్తలు
- దేశంలో కొత్తగా 11,666 కరోనా కేసులు
- శ్రీలంకకు ఐదు లక్షల డోసుల వ్యాక్సిన్ గిఫ్ట్..
- వార్తలలోకి 'మనం 2'.. ఆసక్తిగా గమనిస్తున్న ఫ్యాన్స్
- విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవ దహనం
- ఫిబ్రవరి 1 నుంచి వైద్య కళాశాలలు పునఃప్రారంభం
- ఢిల్లీలో వందలోపే కరోనా కేసులు.. 9 నెలల్లో ఇదే ప్రథమం
- ఢిల్లీని కప్పేసిన మంచుదుప్పటి.. రైళ్లు ఆలస్యం
- పెళ్లి పీటలెక్కిన టీమిండియా ఆల్రౌండర్
- కేరళ బాట పట్టనున్న పుష్ప టీం
- భీవండి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం