మహిళాలకు భరోసా

- మహిళా భద్రతా కేంద్రాలుగా అంగన్వాడీలు
- కార్యాచరణ సిద్ధం చేసే పనిలో అధికారులు
- జిల్లాలో 1209 అంగన్వాడీ కేంద్రాలు
సూర్యాపేట అర్బన్ : మహిళలు, చిన్నారుల కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలు మహిళా భద్రతా కేంద్రాలుగా మారనున్నాయి. ఇందుకోసం అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇక నుంచి వేధింపులకు గురైన మహిళలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుల స్వీకరణకు సంబంధించి అంగన్వాడీ సిబ్బంది ఇప్పటికే శిక్షణను పూర్తి చేసుకున్నారు. జిల్లాలో 1209 అంగన్వాడీ కేంద్రాలు వాటి ద్వారా ప్రస్తుతం ఆరు 47,311 మంది పిల్లలకు పూర్వ, ప్రాథమిక విద్యను అందించడంతోపాటు 14,908 మంది గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నాయి. ఇక నుంచి రక్షణ కేంద్రాలుగా రూపాంతరం చెందనున్నాయి.
మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు మహిళల భద్రతే లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం కానున్నాయి. గురైన మహిళలు పోలీసుస్టేషన్‌కు ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఫిర్యాదులు చేయలేని పరిస్థితి. ఈ క్రమంలో బాధిత మహిళలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా భరోసా కలుగనున్నది. వివిధ రకాల వేధింపులకు గురయ్యే మహిళలు, బాలికలు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఫిర్యాదు చేసేలా ప్రభుత్వం రూపొందించింది. చేసి బాధితులకు సత్వర పరిష్కారం అందించేందుకు అంగన్వాడీ కేంద్రాలను భాగస్వామ్యం చేస్తున్నది. బాలికలను ఎవరైనా వేధించినా, పాల్పడినా నేరుగా అంగన్వాడీ కేంద్రంలో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుల అంగన్వాడీ సిబ్బంది జిల్లా అధికారులకు చేరవేస్తారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు ఉంటారు. గ్రామాల్లో మహిళలు, బాలికలపై వేధింపులు తగ్గనున్నాయి.
సిబ్బందికి పూర్తి..
జిల్లా 1209 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట అర్బన్, తుంగతుర్తి ప్రాజెక్టుల ప్రతి ప్రాజెక్టు నుంచి 15 మంది అంగన్వాడీ సిబ్బందికి ఫిర్యాదుల స్వీకరణపై శిక్షణ ఇచ్చారు. పూర్తి చేసుకున్న సిబ్బంది త్వరలో ప్రధాన అంగన్వాడీ కేంద్రాలతోపాటు మినీ మహిళల రక్షణ, హక్కులు, భారత రాజ్యాంగం, లీగల్ సర్వీసెస్, చట్టాలు, ప్రభుత్వాలు తీసుకునే చర్యలు, ఫిర్యాదులు స్వీకరించే విధానం, సమస్యను ఉన్నతాధికారులకు వివరించడంపై తర్ఫీదు ఇవ్వనున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో వేధింపుల కట్టడి
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మహిళలపై వేధింపులు తగ్గనున్నాయి.ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలు ఉండడం వల్ల వెంటనే చేసేందుకు అవకాశం ఉంటుంది. మహిళలు ఎవరి సాయం అవసరం లేకుండా నేరుగా అంగన్వాడీలో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం జరుగుతుంది. న్యాయ సలహాలపై అంగన్వాడీ సిబ్బందికి ఇప్పటికే రాష్ట్ర స్థాయి శిక్షణ పూర్తయింది.
- కిరణ్మయి, సీడీపీఓ, సూర్యాపేట అర్బన్
తాజావార్తలు
- బడ్జెట్ 2021 : ఆర్థిక మంత్రితో సినీ ప్రతినిధుల భేటీ
- 28న మణుగూరు-సికింద్రాబాద్ రైలు పునరుద్ధరణ
- ఎంపీ అరవింద్‌ను నిలదీసిన పసుపు రైతులు
- వర్మ `డీ కంపెనీ` టీజర్ చూశారా?
- 'శివమొగ్గ పేలుడులో ఆరుగురు మృతి'
- ముత్తూట్ ఫైనాన్స్ చోరీ గుట్టురట్టు:
- మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం : మంత్రి ఈశ్వర్
- ఆకట్టుకుంటున్న అరుదైన తెల్లని కంగారు పిల్ల
- హౌరాలో తృణమూల్xబీజేపీ ఘర్షణ, పలువురికి గాయాలు
- బర్డ్ ఫ్లూతో భయాందోళనలు వద్దు