మంగళవారం 24 నవంబర్ 2020
Suryapet - Nov 23, 2020 , 00:49:47

పిల్లలమర్రి ఆలయాలను సందర్శించిన హైకోర్టు జాయింట్‌ రిజిస్ట్రార్‌

పిల్లలమర్రి ఆలయాలను సందర్శించిన హైకోర్టు జాయింట్‌ రిజిస్ట్రార్‌

సూర్యాపేట రూరల్‌ : మండలంలోని పిల్లలమర్రి దేవాలయాలను హైకోర్టు జాయింట్‌ రిజిస్ట్రార్‌ గంగాధర్‌రావు సందర్శించారు. ఆదివారం ఖమ్మం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న క్రమంలో పిల్లలమర్రిలోని శివాలయం, శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాలయ కమిటీ చైర్మన్‌ గడ్డం ధనలక్ష్మి శాలువా కప్పి దేవాలయ చిత్రపటాలను అందజేశారు. కార్యక్రమంలో  దేవాలయ కమిటీ మాజీ చైర్మన్‌ రాపర్తి సైదులుగౌడ్‌, జానీమియా, అర్చకులు సంతోష్‌శర్మ, నందీశ్వరశర్మ   పాల్గొన్నారు.