శనివారం 05 డిసెంబర్ 2020
Suryapet - Nov 23, 2020 , 00:39:58

మంత్రి జగదీశ్‌రెడ్డి మామ హఠాన్మరణం

మంత్రి జగదీశ్‌రెడ్డి మామ హఠాన్మరణం

  • హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు
  • ప్రముఖుల హాజరు.. మంత్రికి పలువురి పరామర్శ

సూర్యాపేట టౌన్‌ : విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మామ(గుంటకండ్ల సునీత తండ్రి)వెన్న చెంచురెడ్డి శనివారం రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్‌లోని తన స్వగృహంలో గుండెపోటుతో మరణించారు. మామ మరణవార్త తెలిసిన వెంటనే జీహెచ్‌ఎంసీ పరిధిలోని సరూర్‌నగర్‌ డివిజన్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రి జగదీశ్‌రెడ్డి హుటాహుటిన మామగారి ఇంటికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం చెంచురెడ్డి అంత్యక్రియలను జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో నిర్వహించారు. మరణవార్త తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు చెంచురెడ్డి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మంత్రి జగదీశ్‌రెడ్డిని ఫోన్‌లో పరామర్శించారు. మహాప్రస్థానంలో పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, జడ్పీ చైర్మన్లు గుజ్జ దీపికా యుగంధర్‌రావు, బండా నరేందర్‌రెడ్డి, ఎల్మినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్‌, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నోముల నర్సింహయ్య, నల్లమోతు భాస్కర్‌రావు, రవీంద్రనాయక్‌తోపాటు నార్ముల్‌ చైర్మన్‌ గుత్తా జితేందర్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఉప్పల లలితాఆనంద్‌, మాజీ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌ కుమార్‌, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, గండూరి ప్రవళికాప్రకాశ్‌, సుంకరి మల్లేశ్‌, నంద్యాల దయాకర్‌రెడ్డి, కేవీ రామారావు తదితరులు ఉన్నారు.