గురువారం 26 నవంబర్ 2020
Suryapet - Nov 22, 2020 , 01:11:42

మార్కెట్‌ వ్యర్థాలతో వర్మీ కంపోస్టు తయారీ

మార్కెట్‌ వ్యర్థాలతో వర్మీ కంపోస్టు తయారీ

  • సూర్యాపేట మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ లలితాదేవి
  • మార్కెట్‌లో కంపోస్టు యూనిట్‌కు శంకుస్థాపన

సూర్యాపేట అర్బన్‌ : వ్యవసాయ మార్కెట్‌లో లభించే వ్యర్థాలతో వర్మీ కంపోస్టు తయారు చేసేందుకు కంపోస్టు యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఉప్పల లతితాదేవి తెలిపారు.  ఖార్‌ ఎనర్జీ ఆప్టిమైజర్‌ వారి సహకారంతో భారత రసాయన సాంకేతిక పరిశోధన సంస్థ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న వర్మీ కంపోస్టు యూనిట్‌కు  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ప్రతి రోజూ సుమారు 300 కిలోల వ్యర్థాలు వెలువడుతున్నాయని, ప్రతి వారం ఏర్పాటు చేసే సంత ద్వారా మరో  కిలోల వ్యర్థాలు లభిస్తున్నాయని  వాటితో ఎరువు తయారు చేసేందుకు ఈ యూనిట్‌ ఉపయోగపడుతుందన్నారు. ఇక్కడ తయారు చేసిన వర్మీ కంపోస్టును సమీప ప్రాంతాల  అందజేస్తామని తెలిపారు.   ఎనర్జీ ఆప్టిమైజర్‌ సీఈఓ కంచిబొట్ల రాజు మాట్లాడుతూ మార్కెట్‌లో లభించే వ్యర్థాలను ఉపయోగించి అనరోబిక్‌ డైజేషన్‌ పద్ధతుల ద్వారా కంపోస్ట్‌ ఎరువును తయారు చేస్తామన్నారు. ఈ ఎరువుతో  పంటలకు చీడపీడలను తట్టుకునే శక్తి వస్తుందని తెలిపారు. 

కార్యక్రమంలో జడ్పీటీసీ జీడి భిక్షం, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ముద్దం కృష్ణారెడ్డి, ్ఱక్టర్లు  నాగేశ్వర్‌రావు, రమణారెడ్డి, సల్మా మస్తాన్‌, సైదులు, గంగరాజు, శంకర్‌, మార్కెట్‌ సిబ్బంది పాల్గొన్నారు.