బుధవారం 02 డిసెంబర్ 2020
Suryapet - Nov 22, 2020 , 01:11:40

మంత్రి జగదీశ్‌రెడ్డికి ధన్యవాదాలు

మంత్రి జగదీశ్‌రెడ్డికి ధన్యవాదాలు

కోదాడ మహాశక్తి స్పోర్ట్స్‌ క్లబ్‌ చైర్మన్‌ సయ్యద్‌ రఫీ   

కోదాడ రూరల్‌ : కోదాడ పట్టణంలో కబడ్డీ మ్యాట్‌ మినీస్టేడియం నిర్మించేందుకు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చిన విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి కోదాడ మహాశక్తి స్పోర్ట్స్‌ క్లబ్‌ చైర్మన్‌ సయ్యద్‌ రఫీ శనివారం ధన్యవాదాలు తెలిపారు. పట్టణంలోని స్పోర్ట్స్‌ క్లబ్‌ కార్యాలయంలో జరిగిన కబడ్డీ క్రీడాకారుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర, జిల్లా కబడ్డీ అసోసియేషన్ల సహకారంతో క్రీడాకారులు క్రీడల్లో మరింతగా రాణించి రాష్ర్టానికి పేరు తీసుకురావాలని కోరారు. సమావేశంలో కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు.