శుక్రవారం 27 నవంబర్ 2020
Suryapet - Nov 21, 2020 , 01:23:48

అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించొద్దు

అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించొద్దు

సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

మద్దిరాల : గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో సర్పంచులు అలసత్వం వహించొద్దని సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని పోలుమళ్ల, గోరెంట్ల గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటిక పనులను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా నిధులు విడుదల చేస్తుందన్నారు. అలాంటప్పుడు సర్పంచులు చురుగ్గా లేకపోతే అభివృద్ధి జరుగదని తెలిపారు. గ్రామపంచాయతీలకు నిధుల విషయంలో ఢోకా లేదని చెప్పారు. అనంతరం పోలుమళ్ల ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి కాంటాల విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. తూకంలో తేడాలు వస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచులు చిలివేరు భవాని, దామెర్ల వెంకన్న, ఎంపీఓ రాజేశ్‌, ఏలేటి మల్లారెడ్డి ఉన్నారు.